Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మధ్యతరగతి సమస్యలపై ఈశ్వర్ కథతో సూర్యాపేట్‌ జంక్షన్‌ ట్రైల‌ర్

Advertiesment
Ishwar, Naina Sarwar

డీవీ

, శనివారం, 1 ఫిబ్రవరి 2025 (15:43 IST)
Ishwar, Naina Sarwar
ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా నటించిన మూవీ ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు, నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించాడు. ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైల‌ర్ విడుదల కార్య‌క్ర‌మం తాజాగా హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో ఘనంగా జ‌రిగింది.
 
ఈ సంద‌ర్బంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ... ‘‘ఈ సినిమాకు కథ నేనే రాశాను. సూర్యాపేట ప‌రిస‌రాల్లో జరిగే కథ. గవర్నమెంట్ నుంచి ఉచితాలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారో తెలిపే స‌బ్జెక్టు ఇది. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు అదరిస్తారు, హిట్టు చేస్తారని ఎన్నో సార్లు రుజువైంది. అందుకే ఈ సినిమా చేశాం. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా సహజంగానే ఉంటాయి. 4 పాటలు ఉన్నాయి. కథను డైరెక్టర్ రాజేశ్‌ గారు చాలా బాగా తెరకేక్కించారు. మీరందరూ అదరిస్తారని ఆశిస్తున్నాను.’’ అని అన్నారు.
 
హీరోయిన్ నైనా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నేను జ్యోతి పాత్ర‌లో న‌టించాను. యూత్‌కు బాగా న‌చ్చే స‌బ్జెక్టు ఇది. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ప్ర‌తి ఒక్క‌రు ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ మూవీని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను.’’ అని అన్నారు.
 
 ప్రోడ్యూసర్ అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ... మా హీరో ఈశ్వర్ నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. మా హీరో కథకి పూర్తి న్యాయం చేశాడు. కన్నడ, మలయాళం చిత్రాలలో హీరోయిన్ గా నటించిన నైనా సర్వర్ కి ఇది తెలుగులో మొదటి సినిమా. అయినప్పటికీ చాలా చక్కగా నటించింది. గబ్బర్ సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్  విలన్  రోల్ ఈ సినిమాకు కీలకం. ఇంకా చమ్మక్ చంద్ర, భాషా, లక్ష్మణ్  సంజయ్ (బలగం ఫేమ్) హరీష్  చాలా మంది ఈ సినిమాలో చాలా చక్కగా నటించారు. రోషన్ సాలూరి, గౌర హరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ఉన్న మూడు పాటలు, ఒక ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాయి. నిర్మాతలు ఈ సినిమాను ఎక్కడా  కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను త్వరలో రిలీజ్ చేస్తాము' అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమకంటే పెద్దవారైన ఆంటీలతో అబ్బాయిలు శృంగారం.. అనసూయ షాకింగ్ కామెంట్స్