Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగీత ప‌రిశ్ర‌మ‌లోకి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (15:53 IST)
SP music
1964లో డా. రామానాయుడుగారిచే స్థాపించ‌బ‌డినదే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ. జాతీయ సినిమాకు 50 ఏళ్ళకు పైగా సహకారం అందించిన భారతదేశపు అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా అవతరించింది. ఎక్కువ సంఖ్యలో భారతీయ భాషల్లో సినిమాలు తీసిన ఘనత వారికి ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ వారు సినిమాల నిర్మాణమే కాకుండా  తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు.
 
దశాబ్దాలుగా పరిశ్రమ అభివృద్దికి తోడ్పాటు ప‌డిన అగ్రశ్రేణి ప్రొడక్షన్ హౌస్ ఇప్పటికీ కొత్త  ప్రతిభను ప్రోత్సహించే అన్ని రకాల బడ్జెట్ల చిత్రాలను నిర్మిస్తోంది. ఇప్పుడు  'ఎస్పీ మ్యూజిక్' అనే కొత్త మ్యూజిక్ లేబుల్‌ను ప్రారంభించి సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ‌.
 
ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ,  మ్యూజిక్ అనేది మన సినిమాలకు హృదయం లాంటిది. అందుకే దాన్ని సొంతగా సెల‌బ్రేట్ చేసుకోవాల్సిన‌ అవసరాన్ని మేము గుర్తించాము. సురేష్ ప్రొడక్షన్స్ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్న 'SP మ్యూజిక్స్‌ లేబుల్ మంచి సంగీతాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక వేదికగా ఉపయోగపడాలనీ, అలాగే సంగీత శక్తి కేంద్రంగా మారడం లక్ష్యంగా పెట్టుకుంది``అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments