Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష భేటీ.. నిఘాను పెంచిన పోలీసులు

Advertiesment
ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష భేటీ.. నిఘాను పెంచిన పోలీసులు
, గురువారం, 24 జూన్ 2021 (10:26 IST)
కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో అఖిలపక్ష నేత‌ల‌ సమావేశం జ‌రుగ‌నుంది. ఢిల్లీలో ఈ భేటీ జరుగనుంది. దీంతో సమావేశం జరుగనున్న ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 
 
ప్రత్యేకించి నియంత్రణ రేఖ వెంబడి గ‌ల‌ ప్రాంతాల్లో 48 గంటలపాటు హై అలర్ట్‌ విధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. జమ్మూకాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించడం సహా పలు కీలక అంశాలపై గురువాం సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో అక్కడ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా జమ్మూకాశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలను సైతం నిలిపివేయ‌నున్న‌ట్లు స‌మాచారం. రాజ్యాంగంలోని అధికరణ 370 ని రద్దు చేసిన రెండేళ్ల తర్వాత జమ్ముకాశ్మీర్‌ నేతలతో కేంద్రం భేటీ కానుండటం గమనార్హం. 
 
కాగా, ప్ర‌ధానితో అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) సహా కాంగ్రెస్‌, ఇతర రాజకీయ పార్టీల నేతలు అంగీకారం తెలిపారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ రైనా, మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్‌ గుప్తా బుధవారం ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూన్ 24న దేశంలో కరోనా పాజటివ్ కేసులెన్ని?