Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ స్టార్ రజనీకాంత్, కూలీ' నుంచి సైమన్ గా నాగార్జున పరిచయం

డీవీ
శుక్రవారం, 30 ఆగస్టు 2024 (07:34 IST)
Nag ass saiman
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్‌' బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం తన LCU నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో అదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ'సినిమా చేస్తున్నారు. ఇది రజినీకాంత్ కి 171 మూవీ. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్ రివీల్ టీజర్ కు మ్యాసీవ్ రెస్పాన్స్ వచ్చింది.
 
ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, మహేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరింత స్టార్ పవర్‌ను జోడించడానికి, మేకర్స్ కింగ్ నాగార్జునను ప్రత్యేక పాత్రలో పోషించినట్లు నాగార్జున పుట్టినరోజున అనౌన్స్ చేశారు. నాగార్జున ను సైమన్‌గా పరిచయం చేశారు, ఫస్ట్ లుక్ పోస్టర్ డైనమిక్ అవతార్‌ను ప్రజెంట్ చేస్తోంది. స్టైలిష్ షేడ్స్ మెరుస్తున్న గోల్డ్ వాచ్‌తో కనిపించిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది.
 
నాగార్జున చేరికతో స్టార్ పవర్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. రజనీకాంత్, నాగార్జున అభిమానులకు ఇది గ్రేట్ ట్రీట్. నాగార్జున పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
 
కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు గిరీష్ గంగాధరన్ కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌. ఈ సినిమా 2025లో విడుదల కానుంది.
 
తారాగణం: రజనీకాంత్, నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, మహేంద్రన్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments