Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకుని ఆక్రమల కూల్చివేత : సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy

ఠాగూర్

, సోమవారం, 26 ఆగస్టు 2024 (15:01 IST)
శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకుని హైదరాబాద్ నగర చుట్టుపక్కల ఉన్న ఆక్రమణలను కూల్చివేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టచం చేశారు. ఆక్రమణల కూల్చివేతల విషయంలో హైడ్రా చేపట్టిన చర్యలను ఆయన సమర్థించారు. ఈ కూల్చివేతల అంశం ఇపుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందిస్తూ, చెరువులను ఆక్రమించేవాళ్లను వదిలిపెట్టమని హెచ్చరించారు. 
 
ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేది లేదని, చెరువుల పరిరక్షణ ఎంతో కీలకమన్నారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తామన్నారు. శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకుని.. ప్రకృతి సంపదను పరిరక్షిస్తున్నట్టు చెప్పారు. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతామన్నారు. చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారని, ఫాంహౌస్‌ల డ్రైనేజీ కాల్వను గండిపేటలో కలుపుతున్నారని మండిపడ్డారు. మీ విలాసం కోసం వ్యర్థాలను చెరువులో కలుపుతారా? అంటూ ప్రశ్నించారు. 
 
అక్రమ నిర్మాణాలను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా కబ్జాదారులను వదలిపెట్టబోమన్నారు. ప్రకృతిసంపద విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుందన్నారు. చెన్నై, వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపాన్ని కళ్ళారా చూశామన్నారు. భవిష్యత్ తరాలకు మనం ప్రకృతి సంపదను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ సర్కారు.. ఏంటది?