ఒకే రకం పోస్టర్లను వదిలిన సూపర్‌స్టార్, స్టైలిష్‌స్టార్

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (17:40 IST)
టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి మొదలైంది. సాధారణంగా సంక్రాంతి తెలుగిళ్లల్లో చాలా సందడిగా ఉంటుంది... అయితే టాలీవుడ్‌లో కూడా అదే సందడి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. కాగా, ఈ సంక్రాంతికి సందడి చేసేందుకు సూపర్‌స్టార్ అలాగే స్టైలిష్ స్టార్ కూడా రెడీ అయిపోయారు.
 
వివరాలలోకి వెళ్తే... టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలు రెండూ కూడా ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ పోస్టర్‌లు తాజాగా విడుదలయ్యాయి. అయితే, ఈ రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్లు ఒకేలా కనిపిస్తూండడం ఇక్కడ చర్చనీయాంశమైంది.
 
అయితే.. తాజాగా విడుదల చేయబడిన ‘సరిలేరు నీకెవ్వరు’ పోస్టర్‌లో మహేష్ బాబు కొండారెడ్డి బురుజు ముందు ఓ బల్లపై కూర్చుని పక్కకు చూస్తూ నవ్వుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇక ‘అల వైకుంఠపురంలో’ సినిమా పోస్టర్‌ను చూస్తే అల్లు అర్జున్ ఓ గట్టుపై తాపీగా కూర్చుని సిగరెట్ కాలుస్తూ నవ్వుతున్నట్లు కనిపిస్తున్నారు. 
 
మొత్తానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూర్చుని ఇచ్చిన పోజ్ మాత్రం కేక పెట్టిస్తోంది. మరి సంక్రాంతి బరిలోకి దూకుతున్న ఈ రెండు సినిమాలకు పోస్టర్‌లు ఒకే విధంగా ఉన్నా, ప్రేక్షకులు దేనిని ఎక్కువగా ఆదరిస్తారో వేచి చూద్దాం..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments