Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలితో స్పూర్తితో రాబోతున్న మరో చిత్రం..!

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (17:35 IST)
బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత హిట్టు అయిందో మనం చూసాం. భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం సినీ పరిశ్రమలో కొత్త ఆశల్ని చిగురింపజేసింది. భారీ చిత్ర నిర్మాణ విషయంలో మన వాళ్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, పెట్టిన డబ్బు తిరిగి రాబట్టుకోవడం చాలా కష్టం అని భావించి భారీ చిత్రాలను నిర్మించడానికి సాహసించలేదు. బాహుబలి సినిమా విడుదలైన తర్వాత ఈ పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చింది. ఈ తరహా కథలను తెరకెక్కించడానికి ఇప్పుడు అనేక దర్శకనిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
 
ఈ ప్రయత్నంలో భాగంగానే మలయాళం నుంచి 'మ‌ర‌క్కార్' అనే చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ఇందులో కథానాయకుడుగా నటిస్తున్నారు. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్‌తో ఆంటోని పెరంబవూర్ ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. 2018 సంవత్సరానికి గానూ జాతీయ ఉత్తమ నటి అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. అంతే కాకుండా మోహ‌న్‌లాల్ త‌న‌యుడు ప్ర‌ణ‌వ్ మోహ‌న్‌లాల్‌, ప్రియ‌ద‌ర్శ‌న్ కూతురు క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, సుదీప్‌, మంజు వారియ‌ర్ తదితర నటీనటులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మల‌యాళ భాష‌ల్లో మార్చి 26న ప్ర‌పంచవ్యాప్తంగా రిలీజ్ చేయ‌బోతున్నారు. మాలీవుడ్ సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. నూతన సంవత్సరం సంద‌ర్భంగా హీరో మోహ‌న్‌లాల్ ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా విడుదల చేసారు. మ‌ర‌క్కార్ గెటప్‌లో మోహ‌న్‌లాల్ గుర్రం స్వారీ చేస్తున్నట్లు ఉన్న పోస్టర్ సినిమాపై భారీగా అంచ‌నాల్ని పెంచుతోంది. ఈ చిత్రాన్ని దాదాపు 5000 స్క్రీన్‌లపై ప్రదర్శించేలా చేయడానికి దర్శకనిర్మాతలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments