Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘వివాహ భోజనంబు’అంటున్న‌ సందీప్ కిష‌న్, ఇంత‌కీ ఏంట‌ది..?

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (13:18 IST)
భాగ్యనగర వాసులకు తెలుగింటి వంట రుచి ఏంటో చూపిస్తూ… ఎప్పటికప్పుడు కొత్త కొత్త రుచులను అందిస్తున్న ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ కొత్త బ్రాంచ్ ఆదివారం ఏఎస్‌రావు నగర్‌లో ప్రారంభమైంది. యువ కథానాయకుడు సందీప్ కిషన్, ఆయన స్నేహితులు రవిరాజు, అమిత్, షెఫ్ యాదగిరి కలిసి తొలుత జూబ్లీహిల్స్‌లో ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ ప్రారంభించారు. ఏడాదిలో ప్రజల ఆదరణ పొందింది. రెండో ఏడాది సికింద్రాబాద్‌లోని పార్క్‌లేన్‌లో రెండో బ్రాంచ్ ప్రారంభించారు. 
 
విజయవంతంగా మూడో ఏడాదిలో అడుగుపెట్టిన ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ కొత్త బ్రాంచ్ ఇప్పుడు ఏఎస్‌రావు నగర్‌లో ఓపెన్ అయింది. అలాగే, సూపర్‌స్టార్ మహేష్‌ బాబుకు చెందిన ఏఎంబి మాల్, మై హోమ్ అంబుజాలో ఫుడ్ కోర్ట్స్ ‘వివాహ భోజనంబు’కు ఉన్నాయి.
 
గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు (ఎంపి), తెరాస నేత జె. సంతోష్ కుమార్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎంఎల్‌సిలు పి. శ్రీనివాసరెడ్డి, కె. నవీన్ రావు, సందీప్ కిషన్ దీపారాధనతో ఏఎస్‌రావు నగర్‌లో ‘వివాహ భోజనంబు’ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీనియర్ తెరాస నేత లక్ష్మణారెడ్డి, కార్పొరేటర్లు పురుషోత్తం రెడ్డి, పావని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 రవిరాజు మాట్లాడుతూ.. “రెండో సంవత్సరం సికింద్రాబాద్‌లో స్టార్ట్ చేశాం. మూడో సంవత్సరం ఏఎస్ రావు నగర్ – సైనిక్ పురి క్రాస్ రోడ్స్ దగ్గర స్టార్ట్ చేశాం. ఇది చాలా పెద్దది కావాలని కోరుకుంటున్నాను. ఈ రెస్టారెంట్లో మొత్తం మూడు ఫ్లోర్స్ ఉన్నాయి. రెండు ఫ్లోర్స్‌లో బాంకెట్ హాల్స్ ఉన్నాయి. ఒక్కో హాల్‌లో 300 మంది హ్యాపీగా పార్టీ, ఫంక్షన్ చేసుకోవచ్చు. 
 
రెస్టారెంట్లో వందమందికి పైగా కూర్చుని తినవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వంటకాలను, చాలామందికి తెలియని రుచులను ప్రజలకు అందించడం మాకు సంతోషంగా ఉంది. సందీప్ కిషన్ గారికి, అమిత్ గారికి థాంక్స్” అని అన్నారు.
 
 ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ పార్ట్‌నర్స్‌లో ఒకరు, హెడ్ చెఫ్ అయిన యాదగిరి మాట్లాడుతూ... “సందీప్ కిషన్ గారు ‘వివాహ భోజనంబు’ పేరు ఎందుకు పెట్టారనేది తొలుత ఎవరికీ అర్థం కాలేదు. కానీ, ఈ రోజు అందరికీ అర్థం అయింది. అమ్మచేతి కమ్మదనం ఎక్కడ దొరుకుతుందంటే… వివాహ భోజనంబు అని నేను గట్టిగా చెబుతాను. రాబోయే తరానికి ఆరోగ్యమే ఒక ఔషధంగా మారాలన్నది మా సంకల్పం. ఆహారాన్ని ఒక ఔషధంగా ప్రజలకు మేం అందిస్తాం” అని అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ.... “ఈ రెస్టారెంట్ ప్రాంరంభోత్సవానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్. ఇప్పటివరకూ మా రెస్టారెంట్లకు వచ్చి భోజనం చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. వాళ్లకు మా ఫుడ్ నచ్చడం వల్ల మేం అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాం. 
 
ప్రతి డిసెంబర్‌లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తూ వస్తున్నాం. ‘వివాహ భోజనంబు’ ఫ్యామిలీకి మూడో ఏడాది ఇది. ఇప్పుడు ఏఎస్‌రావు నగర్‌లో మూడో బ్రాంచ్ ఓపెన్ చేశాం. మా రెస్టారెంట్ విజయానికి కారణం చెఫ్‌లే. మా రెస్టారెంట్లలో సుమారు 250 నుండి 300 మంది చెఫ్‌లు యాదగిరి నేతృత్వంలో పని చేస్తున్నారు. ఇంచుమించు 900 మందికి పైగా పని చేస్తున్నారు. సుమారు 1000 మంది ఫ్యామిలీలు ఈ రెస్టారెంట్ల మీద ఆధారపడి ఉన్నారు. అందరికి పని కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. త్వరలో ఇతర నగరాల్లోనూ మా రెస్టారెంట్ బ్రాంచ్‌లు ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నాం” అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments