Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాఫింగ్ రైడర్‌గా 'తెనాలి రామకృష్ణ' ట్రైలర్

Advertiesment
లాఫింగ్ రైడర్‌గా 'తెనాలి రామకృష్ణ' ట్రైలర్
, ఆదివారం, 10 నవంబరు 2019 (14:17 IST)
టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బీఏబీఎల్. కేసులు ఇవ్వండి ప్లీజ్ అనేది ట్యాగ్ లైన్. ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. శ్రీ నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సందీప్ కిష‌న్ లాయ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ, లాఫింగ్ రైడ‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హ‌న్సిక, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. 
 
తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఫన్నీ సన్నివేశాల‌తో రూపొందిన ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. నవంబ‌ర్ 15న విడుద‌ల కానున్న చిత్ర ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా' సాంగ్..