Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సందీప్ ఫ‌స్ట్ టికెట్ ఆ హీరోకి ఇచ్చాడా..?

Advertiesment
సందీప్ ఫ‌స్ట్ టికెట్ ఆ హీరోకి ఇచ్చాడా..?
, శుక్రవారం, 12 జులై 2019 (19:24 IST)
యువ హీరో సందీప్ కిషన్ న‌టించిన తాజా చిత్రం నిను వీడని నీడను నేనే. కార్తీక్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా ఈరోజు (జులై 12)  ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. నిన్నరాత్రి సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా నిఖిల్, సుధీర్ బాబు, కార్తికేయ, విష్వక్సేన్ హాజరయ్యారు.
 
ఈ సినిమా సెకండ్ టికెట్ ఈ యువ హీరోల‌కు సందీప్ కిషన్ అందజేశాడు. ఫస్ట్ టికెట్ ఏ హీరోకి ఇవ్వనున్నది తర్వాత చెబుతానని అన్నాడు. దీంతో ఎవ‌రికి ఇస్తాడా అని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే... ఈ రోజు సందీప్ కిషన్ తన సినిమా ఫస్ట్ టికెట్‌ను యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్‌కి అందజేశాడు. హైద‌రాబాద్ ప్రసాద్ మల్టిప్లెక్స్‌లో ప్రదర్శితం కానున్న ఈ సినిమా టికెట్‌ను ప్రభాస్‌కి అందజేస్తూ దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
 
ఈ సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది. ఖ‌చ్చితంగా సందీప్ కిష‌న్‌కి విజ‌యాన్ని అందిస్తుంద‌ని టీమ్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు. ఎప్ప‌టి నుంచో స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తోన్న సందీప్ కిషన్ హిట్ కొడతాడేమో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్‌లో ఓ బేబి... ప్లాన్ చేస్తుంది ఎవ‌రో తెలుసా..?