'బాహుబలి చిత్రం తరువాత ప్రపంచ సినిమా బాక్సాఫీస్ ఒక్కసారిగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం వైపుకి మళ్ళింది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 15న భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
అలాంటి మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ సాహో అప్‌డేట్స్ గ్యాప్ లేకుండా రావడంతో అభిమానుల చాలా ఆనందంగా వున్నారు. ఇటీవల విడుదలైన సైకో సయ్యో అనే సాంగ్‌కి బాలీవుడ్, టాలీవుడ్, తమిళ, మళయాల భాషల్లో విపరీతమైన బజ్ రావటంతో చిత్ర యూనిట్ చాలా ఆనందంగా వున్నారు.
ఇక సోషల్ మీడియాలో అయితే వరల్డ్‌వైడ్‌గా ప్రభాస్ అభిమానులు ఈ సాంగ్స్ మీద టిక్‌టాక్‌లు డబ్‌స్మాష్‌లు చేస్తున్నారు. ఈ సాంగ్‌లో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ చాలా స్టైలిష్‌గా కనిపించటం తెలుగు అభిమానుల్ని సంతోషంలో ముంచింది. అలాగే హీరోయిన్ శ్రధ్ధా కపూర్ చాలా అందంగా కనిపించింది. సాంగ్‌లో ప్రభాస్, శ్రద్ధాలు చేసిన డాన్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సాంగ్ విడుదలని 5 సిటీస్‌లో నాలుగు భాషల్లో రెబల్‌స్టార్ అభిమానులకి స్పెషల్ స్క్రీనింగ్ చేయటంతో ఫ్యాన్స్‌కి పండగలా అనిపించింది.
అదేరోజు హీరోయిన్ శ్రధ్ధా కపూర్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈ సాంగ్‌కి సంబందించి జిఫ్ ఫైల్ పోస్ట్ చేయటంతో వరల్డ్ వైడ్‌గా వైరల్ అయ్యింది. ఈ సాంగ్‌ని సెట్లో చిత్రీకరించారు. అలాగే ఈ సినిమాలోని రెండు సాంగ్స్ ఆస్ట్రియా లోని అందమైన లోకేషన్స్‌లో చిత్రీకరించారు. మరో పాటని కురేషియా లోని చిత్రీకరించారు. ఈ సాంగ్ 50 మంది మిస్ కురేషియా మోడల్స్‌తో షూట్ చేసారు.
అలాగే అబుధబి లోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆశ్యర్యంలో ముంచెత్తుతాయి. ఇప్పటికే ఛాప్టర్1, ఛాప్టర్ 2, టీజర్లతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని పెంచిన ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో టాలీవుడ్ ప్రిస్టేజియస్ ప్రోడక్షన్ హౌస్ యువి క్రియెషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్‌ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్. ఇక ఈ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15 న ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్‌గా విడుదలకి సిద్ధమౌతోంది.