Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆన్‌లైన్‌లో 2019 అక్టోబర్‌ నెల ఆర్జిత సేవలు... సుప్రభాత సేవా టిక్కెట్లు 7,180

Advertiesment
ఆన్‌లైన్‌లో 2019 అక్టోబర్‌ నెల ఆర్జిత సేవలు... సుప్రభాత సేవా టిక్కెట్లు 7,180
, శుక్రవారం, 5 జులై 2019 (11:39 IST)
ఆన్‌లైన్‌లో అక్టోబరు నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల వివరాలు ఇలా వున్నాయి. 2019 అక్టోబరు నెల కోటాకు సంబంధించి మొత్తం 55,355 సేవా టిక్కెట్లు వున్నాయి. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 9,305 సేవా టికెట్లు విడుదల చేశారు. వీటిలో సుప్రభాతం 7,180, తోమాల 110, అర్చన 110, అష్టదళపాదపద్మారాధన 180, నిజపాదదర్శనం 1,725 టికెట్లు.
 
ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరిలో 46,050 సేవాటికెట్లు ఉన్నాయి. విశేషపూజ 1500, కల్యాణం 10,450, ఊంజల్‌ సేవ 3,300, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,050, వసంతోత్సవం 11,550, సహస్ర దీపాలంకార సేవ 13,200 టికెట్లు వున్నాయి.
 
13న తిరుమలకు రాష్ట్రపతి రామ్ నాథ్.......
ఈ నెల 13న తిరుమలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రానున్నారు. 14న ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోవింద్... గోవిందుని వద్దకు రెండుమార్లు వచ్చి వెళ్లారు. మళ్ళీ కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన వస్తుండడంతో ఎనలేని ప్రాధాన్యత నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 5 మీ రాశి ఫలితాలు... ఆ రాశి వారు ఆర్థిక విషయాలు...