Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

జూలై 5 మీ రాశి ఫలితాలు... ఆ రాశి వారు ఆర్థిక విషయాలు...

Advertiesment
July 5th
, శుక్రవారం, 5 జులై 2019 (10:51 IST)
మేషం: కళా, సాంస్కృతిక, బోధన, విదేశీ వ్యవహారాల రంగాలకు చెందినవారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా వుంటుంది. బిల్లులు చెల్లిస్తారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. ఊహించని ఖర్చులు చికాకు పరుస్తాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు.
 
వృషభం: ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. సహోద్యోగులతో వ్యక్తిగత విషయాలు చర్చకు వస్తాయి. రావలసిన ధనం చేతికి అందటంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. తెలివితేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి.
 
మిధునం: ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహనకు వస్తారు. వడ్డీలు, డిపాజిట్లు అందుకుంటారు. భాగస్వామిక ఒప్పందాలు, ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలిస్తాయి. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. పెద్దల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసేవారు మీ సహాయం అర్థిస్తారు. ఫీజులు చెల్లిస్తారు. శ్రీవారు, శ్రీమతికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. విదేశీ యానం కోసం యత్నాలు అనుకూలిస్తాయి.
 
సింహం: విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. పాత సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. 
 
కన్య: వస్త్రాలు, ఆభరణాలు విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోర్కె నెరవేరగలవు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. పెన్షన్, భీమా పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేస్తారు. వ్యవసాయ రంగాల వారికి విత్తనాలు కొనుగోలు విషయంలో మెలకువ అవసరం.
 
తుల: పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రత్యర్థుల కదిలిక పట్ల ఓ కన్నేసి వుంచండి. శ్రీవారు, శ్రీమతి గౌరవప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రకటనలు, న్యాయ బోధనా రంగాల వారికి అనుకూలం. గృహావసరాలకు నిధులు సమకూరుతాయి. బంధువులను కలుసుకుంటారు. 
 
వృశ్చికం: ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి వుంటుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి. పెంపుడు జంతువుల విషయంలో మెలకువ అవసరం. మీ మాటకు సంఘంలో గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై యత్నాలు చేస్తారు. 
 
ధనస్సు: ప్రింటింగ్, మీడియా రంగాల వారు జాగ్రత్తగా వుండాలి. ఉమ్మడి నిధుల నిర్వాహణలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. చిన్నారుల విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలలో ఖర్చులు అంచనాలను మించుతాయి. 
 
మకరం: సోదరీసోదురుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. కోర్టు పనులు, లిటిగేషన్లు పరిష్కారం అవుతాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడుతారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి ఓ సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
కుంభం: స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. స్పెక్యులేషన్లు, పోటీల్లో నష్టం సంభవం. ప్రత్యర్థులు మీ శక్తిసామర్థ్యాలను గుర్తిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు సంతృప్తికరంగా వుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ వంటి శుభవార్తలు అందుతాయి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. 
 
మీనం: విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరదు. తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవడం క్షేమం కాదు. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అష్ట మహాదానాలు అని వేటిని అంటారు?