Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

21-04-2019 నుంచి 27-04-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (18:13 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
అంచనాలు ఫలించవు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. చేతిలో ధనం నిలవదు. వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. మొండిగా వ్యవహరిస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖుల దర్శనం వీలుకాదు. సంతానంపై చదువులపై దృష్టి పెడతారు. బుధవారం నాడు హడావుడిగా సాగుతాయి. నోటీసులు, పత్రాలు అందుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన మంచిది. వాహనం, గృహోపకరణాలు మరమ్మత్తుకు గురవుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. అనవసర జోక్యం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులతో జాగ్రత్త. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం విరమించుకుంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు సకాలంలో పూర్తికాగలవు. ప్రేమానుబంధాలు బలపడుతాయి. వాగ్ధాటితో రాణిస్తారు. బంధువులకు సాయం అందిస్తారు. గురు, శుక్ర వారల్లో అపరిచితులతో జాగ్రత్త. మీ నుండి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగస్తులకు భారం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు సఫలమవుతాయి. ప్రియతముల క్షేమం తెలుసుకుంటారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు వేగవంతమవుతాయి. పరిస్థితుల అనుకూలత ఉంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శని, ఆది వారాల్లో ఊహించని సంఘటలెదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సేవ, పుణ్య కార్యంలో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించండి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని సమస్యల నుండి బయటపడుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సోమ, బుధ వారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వివాహ ఏజెన్సీలను విశ్వసించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. స్టాక్ మార్కెట్ రంగాలవారికి మిశ్రమ ఫలితం.   
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. కలుపుగోలుగా వ్యవహరించాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. మీ ఉన్నతిని చాటుకునేందుకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడుతాయి. మంగళ గురు వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. స్వాగత, వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు వాయిదా పడుతాయి. సంప్రదింపులు ఫలించవు. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. శుక్ర, శనివారాల్లో మీ గౌరవానికి భంగం కలిగే ఆస్కారం ఉంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.     
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా వ్యవహరించాలి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలకు సన్నాహాలు ప్రోత్సాహం ఉంటుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. ఆదివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం క్షేమం కాదు.   
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. మానసికంగా కుదుటపడుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. సోమ, మంగళ వారాల్లో వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. ప్రియతములను కలుసుకుంటారు. వాయిదా పడిన పనులు పూర్తికాగలవు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గత సంఘటనలు జ్ఞప్తికొస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. నిర్మాణాలు, మరమ్మత్తులు ముగింపుకొస్తాయి. సంతానం అత్యుత్యాహాన్ని అదుపు చేయండి. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.  
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అవసరాలు నెరవేరుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మీపై ఎదుటివారికి గురి కుదురుతుంది. బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడుతాయి. పనులు వేగవంతమవుతాయి. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్‌‍లో అలక్ష్యం తగదు. బుధు, గురు వారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సేవా, సాంకేతిక రంగాలవారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం అనుకూల పరిస్థితులున్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఉన్నతిని చాటుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. పనులు వేగవంతమవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ కించపరచవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. సాంకేతిక, సేవా రంగాలవారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. రోజువారి ఖర్చులే ఉంటాయి. పనుల్లో అవాంతరాలెదుర్కుంటారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. సంతానం పై చదువులపై దృష్టి పెడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులు ప్రశంసలందుకుంటారు. విందులు, వినోదాల్లో మితంగా వ్యవహరించండి. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఆదాయం మార్గాలు అన్వేషిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. శని, ఆది వారాల్లో ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు. శ్రీమతి లేక శ్రీవారి వైఖరి అసహానం కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. కొంతమంది సమాచార సేకరణకు యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్‌లో అనుకూలం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. ఆశావాహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

అబ్బాయి లేదా అమ్మాయి పెళ్లి ఎందుకు ఆలస్యం అవుతుంది?