Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

10-02-2019 నుంచి 16-02-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు (Video)

webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (16:40 IST)
కర్కాటకంలో రాహువు, వృశ్చికంలో బృహస్పతి, ధనస్సులో శని, మకరంలో రవి, కేతువు, బుధులు, మీనంలో కుజుడు, మకర, కుంభ, మీన మేషంలలో చంద్రుడు. 12న రథసప్తమి, 16న భీష్మ ఏకాదశి. అంతర్వేద తీర్థం. ముఖ్యమైన పనులకు సప్తమి, మంగళవారం అనుకూలం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుటపడుతారు. నిలిపివేసిన పనులు పునఃప్రారంభఇస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. శనివారం నాడు ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. విమర్శలను దీటుగా ఎదుర్కుంటారు. సమర్థతక గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. స్వయం ఉపాధి కలిసివస్తుంది. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆలోచనులు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం ఉంది. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఆది, సోమ వారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక వీలుకాదు. జారవిడుచుకున్న వస్తువులు తిరిగి లభ్యమవుతాయి. మీ శ్రీమతివైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. బంధువులతో అవగాహన నెలకొంటుంది. పెట్టుబడులు, పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఉద్యోగస్తులకు అధికారులతో చికాకులు తప్పవు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణం తలపెడుతారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. మంగళ, బుధ వారాల్లో మీ విషయాల్లో ఇతరులకు తావివ్వవద్దు. ముఖ్యలతో సంప్రదింపులు జరుపుతారు. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి అధికం. విదేశాల్లోని సంతానం క్షేమం తెలుసుకుంటారు.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. కష్టం ఫలిస్తుంది. పదవులు, బాధ్యతలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. గుట్టుగా యత్నాలు సాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. గురు, ఆది వారాల్లో అనాలోచిత నిర్ణయాలు తగవు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. పరిచయం లేని వారితో జాగ్రత్త. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలను విశ్వసించవద్దు. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం.    
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహార జయం, సమస్యల పరిష్కారం ఉన్నాయి. మీ నమ్మకం వమ్ము కాదు. అవకాశాలు కలిసివస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. బంధువులతో సంబంధాలు బలపడుతాయి. శుక్ర, ఆది వారాల్లో ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అనేక పనులతో సతమతమవుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పిల్లల చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నిర్మాణాలు, మరమ్మత్తులు చురుకుగా సాగుతాయి. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. మీ సలహా ఎదుటివారికి లాభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.  
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. ధనమూలక సమస్యలెదురవుతాయి. ఒత్తిడి, చికాకులు అధికం. చీటికిమాటికి అసహానం చెందుతారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. దస్త్రం వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఆశించిన పదవులు దక్కవు. పట్టుదలతో యత్నాలు సాగించండి.     
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక ఇబ్బంది లేకున్నా వెలితిగా ఉంటుంది. ప్రతి విషయానికి ఆందోళన చెందుతారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. సన్నిహితుల కలయికతో కుదుటపడుతారు. రోజువారి ఖర్చులే ఉంటాయి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. అనసర జోక్యం తగదు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పిల్లల చదువులపై శ్రద్ధ వహించండి. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. గృహమార్పులకు అనుకూలం. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. హోల్‌‍సేల్ వ్యాపారులకు సమస్యలెదురవుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.   
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
సమర్థతతో రాణిస్తారు. కష్టం ఫలిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. సన్నిహితులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పెట్టుబడులకు అనుకూలం. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. సోమ, మంగళ వారాల్లో ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదరువుతాయి. ప్రియతముల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ధనప్రలోభం తగదు. అపరిచితులతో జాగ్రత్త. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆశావాహ దృక్పథంతో వ్యవహరించండి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడుతారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. రావలసిన ఆదాయంపై దృష్టి పెడతారు. బుధవారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. పంతాలు, పట్టుదలకు పోవద్దు. ఆప్తులను కలుసుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. శుభకార్యంలో పాల్గొంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం, విద్యార్థులకు ఒత్తిడి, అవగాహన లోపం.   
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కలుపుగోలుగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త పరిచయాలేర్పడుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయియ. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. పనులు సకాలంలో పూర్తికాగలవు. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. గురు, శుక్ర వారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఊహించన సంఘటనలెదురవుతాయి. ప్రముఖుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఉద్యోగస్తుల అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. సామాజిక, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చుల విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. నూతన వ్యాపారాలు చేపడతారు. భాగస్వామిక చర్చలు కొలిక్కివస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు స్థానచలనం. సాంకేతిక రంగాలవారికి ఆదాయాభివృద్ధి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. విదేశాల్లోని సంతానం క్షేమం తెలుసుకుంటారు.  
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. గృహం సందడిగా ఉంటుంది. వివాహ యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు చురుకుగా సాగుతాయి. వాహనం, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆది, సోమ వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంప్రదింపులు ఫలిస్తాయి. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసికంగా కుదుటపడుతారు. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అవకాశం లభిస్తుంది. ఆడిటర్లకు ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

శంఖుధ్వని వినిపిస్తే...?