Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

27-01-2019 నుంచి 02-02-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (16:58 IST)
కర్కాటకంలో రాహువు, తులలో గురు, శుక్రులు, ధనస్సులో రవి, మకరంలో బుధ, కేతువులు, మీనంలో కుజుడు. కన్య, తుల, వృశ్చిక, ధనుర్ రాశులలో చంద్రుడు. 29న శుక్రుడు ధనుర్ ప్రవేశం. ఫిబ్రవరి 2న శని త్రయోదశి, వృషభ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించిన శుభం, జయం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. ఆది, సోమ వారాల్లో అపరిచితులను విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ధనలాభం ఉంది. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఖర్చులు సామాన్యం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కీలక పత్రాలు, రశీదులు జాగ్రత్త. చెల్లింపులు, నగదు స్వీకరణలో మెళకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. అధికారులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. రాబోయే ఆదాయనికి తగ్గట్టు ఖర్చులుంటాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు నెరవేరుతాయి. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మంగళ, శని వారార్లో పనులు హడావుడిగా సాగుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. విద్యార్థులకు ఒత్తిడి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రయాణం సజావుగా సాగుతుంది.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సమర్థతతో రాణిస్తారు. పనులు సానుకూలమవుతాయి. వ్యవహారానుకూలత ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గురు, శుక్ర వారాల్లో అనవసర జోక్యం తగదు. ఖర్చులు సామాన్యం. నోటీలుసు, కీలక పత్రాలు అందుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఉత్సాహాన్నిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వివాదాలు సద్దుమణుగుతాయి.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. పొదుపు ధనం అందుతుంది. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. పదపులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. పెట్టుబడులకు అనుకూలం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. కొత్తగా వచ్చిన అధికారులతో జాగ్రత్త. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.    
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ వారం అన్ని రంగాల వారికి ఆశాజనకమై. ఖర్చులు సంతృప్తికరం. పరిస్థితుల అనుకూలత ఉంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వెంచర్చకు అనుకూలం. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. పురస్కారాలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. వివాదాలు సద్దుమణుగుతాయి.  
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పనులు వేగవంతమవుతాయి. పెట్టుబడులకు అనుకూలం. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకోగల్గుతారు. ఆలోచనులు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు సామాన్యం. అయిన వారికి సాయం అందిస్తారు. సంతానం కదలికపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత. సమయపాలన ముఖ్యం. అధికారుల తీరును గమనించి మెలగండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు, ప్రణాళికలు మునుముందు ఫలితాలిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు.     
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ముఖ్యం. ఎవరినీ నిందించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలెదురవుతాయి. చీటికిమాటికి అసహానం చెందుతారు. ఓర్పుతో వ్యవహరించాలి. ఆది, సోమ వారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆప్తుల కలయికతో కుదుటపడుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. అవివాహితుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. నిరుత్సాహనం వీడి ఉద్యోగయత్నం సాగించండి. నూతన అధికారులకు స్వాగతం పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. వ్యాపారాల విస్తరణలకు తరుణం కాదు.   
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
అన్ని రంగాల వారికి యోగదాయకమే. సంప్రదింపులకు అనుకూలం. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రుణబాధలు తొలుగుతాయి. మానసికంగా కుదుటపడుతారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం సాయం క్షేమం కాదు. మంగళ, బుధ వారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విదేశీయాన యత్నం ఫలిస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. జూదాలకు దూరంగా ఉండాలి.  
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1వ పాదం
బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. గురు, శుక్ర వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుకాదు. సన్నిహితుల సాయం అందుతుంది. మానసికంగా కుదుటపడుతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. షేర్ల క్రయవిక్రయాలకు అనుకూలం. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి.   
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడుతాయి. శనివారం నాడు తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పనులు వేగవంతమవుతాయి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతబిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. కష్టానికి గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆది, సోమ వారాల్లో అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. బంధుత్వాలు, పరిచయాలు విస్తరిస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. ప్రేమానుబంధాలు బలపడుతాయి. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. సహోద్యోగులతో జాగ్రత్త. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. వృత్తుల వారికి ఆశాజనకం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. గృహంలో స్తబ్ధత తొలుగుతుంది. వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఆత్మీయుల సలహాలు పాటించండి. మంగళ, బుధ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుకాదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. అధికారులకు అదనపు బాధ్యతలు, విశ్రాంతి లోపం. వ్యాపారాల్లో ఒడిదుకులెదురవుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వీడియో చూడండి....

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

దీపాన్ని ఎలా వెలిగించాలి.. ఎలా కొండెక్కించాలంటే?