Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-10-2018 నుంచి 20-10-2018 మీ వార రాశి ఫలితాలు(వీడియో)

Advertiesment
14-10-2018 నుంచి 20-10-2018 మీ వార రాశి ఫలితాలు(వీడియో)
, శనివారం, 13 అక్టోబరు 2018 (21:31 IST)
కర్కాటకంలో రాహువు, కన్యలో రవి, తులలో బుధ, వక్రి శుక్రులు, వృశ్చికంలో బృహస్పతి, ధనస్సులో శని, మకరంలో కుజ, కేతువులు. వృశ్చిక, ధనస్సు, మకర, కుంభంలో చంద్రుడు. 17న రవి తుల ప్రవేశం. 15న సరస్వతీ పూజ, 17న దుర్గాష్టమి, 18న మహర్నవమి, విజయదశమి. 20న సర్వ ఏకాదశి. 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. చక్కని నిర్ణయాలు తీసుకోగల్గుతారు. మీ మాటపై ఎదుటివారికి గురికుదురుతుంది. ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆది, సోమ వారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పరిచయం లేని వారితో మితంగా సంభాషించండి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఒక ఆహ్వానం ఆశ్చర్యపరుస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. టెండర్లు, ఏజెన్సీలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ధనయోగం, పదోన్నతి. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు బలపడుతాయి. వేడుకలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
శుభకార్య యత్నం ఫలిస్తుంది. ఒప్పందాల్లో మెళకువ వహించండి. స్తోమతకు మించి హామిలివ్వవద్దు. వివాహ వేదికలు అన్వేషిస్తారు. అప్రయత్నంగా అవకాశం కలిసివస్తుంది. సన్నిహితుల సలహా తీసుకుంటారు. కష్టం ఫలిస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు అంచనాలను మించుతాయి. మంగళ, బుధ వారాల్లో పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ఆత్మీయులను విందులు, వేడుకలకు ఆహ్వానిస్తారు. అనేక పనులతో సతమతమవుతారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. దూరప్రయాణం చికాకుపరుస్తుంది.  
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. మీ శ్రీమతి వైఖఱి అసహానం కలిగిస్తుంది. ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా ఉండాలి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆదాయం సంతృప్తికరం. మెుండి బాకీలు వసూలవుతాయి. ఆది, గురు వారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ధనప్రాప్తి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. దైవదర్శనంలో అవస్థలు తప్పవు.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని రంగాల వారికి ఆశాజనకం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యల నుండి బయటపడుతారు. గృహంలో స్తబ్థత తొలగుతుంది. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పెద్దమెుత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయెుద్దు. మంగళ, శని వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పనులు ముగింపుకొచ్చేసరికి అస్తవ్యస్తంగా సాగుతాయి. పదవుల కోసం చేసే యత్నం ఫలించకపోవచ్చు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం.  
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనానికి లోటుండదు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. గురు, శుక్ర వారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెళగండి. విమర్శలు, అభియోగాలకు దీటుగా స్పందిస్తారు. మీ నిజాయితీ బయటపడుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సమావేశాలలో పాల్గొంటారు. కళకారులకు ప్రోత్సాహకరం. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆర్థికలావాదేవీలు చికాకుపరుస్తాయి. ధనవ్యయం విపరీతం. అప్రమత్తంగా వ్యవహరించాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. బంధువులతో విభేదిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆప్తుల కలయికతో కుదుటపడుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. బాధ్యతలు అప్పగించవద్దు. శనివారం నాడు మీ జోక్యం అనివార్యం. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. వృత్తుల వారికి సామాన్యం. దైవదర్శనం ప్రశాంతంగా సాగుతుంది.  
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం ప్రతికూలతలే అధికం. అనేక పనులతో సతమతమవుతారు. ప్రతి చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండడానికి యత్నించండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్తవారితో సంప్రదింపులు జరుపుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో ఏకాగ్రత వహించండి. మెుహమ్మాటలు, భేషజాలకు పోవద్దు. వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. నష్టాల నుండి బయటపడుతారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలలో తీరిక ఉండదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలుచేస్తారు
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అంచాలనకు భిన్నంగా ఉంటాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవకాశాలు చేజారిపోతాయి. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ప్రియతముల రాక సంతోషాన్నిసిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ మార్పు కలిసివస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ధనయోగం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. జూదాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి. దైవదర్శనంలో అవస్థలు తప్పవు.  
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. గృహమార్పు కలిసివస్తుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. వ్యవహారానుకూలత ఉంది. వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటారు. కష్టం ఫలిస్తుంది. ఖర్చులకు అంతుండదు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. ఆది, సోమ వారాల్లో పనులు మెుండిగా పూర్తిచేస్తారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం దూకుడును అదుపుచేయండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం. వాహనచోదకులకు చికాకులు అధికం.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆత్మీయులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. సన్నిహితులు చేయూతనిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. బంధుత్వాలు బలపడుతాయి. అనేక పనులతో సతమతమవుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. సంతానం దూకుడును కళ్లెం చేయండి. మంగళ, బుధ వారాల్లో అపరిచితులతో జాగ్రత్త. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు ధనప్రాప్తి. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.   
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఏదైనా రంగంలో రాణిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలుకు దూరంగా ఉంచండి. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు విపరీతం. విలాసాలు, దైవకార్యాలకు వ్యయం చేస్తారు. గురు, శుక్ర వారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. ప్రకటనల పట్ల అవగాహన అవసరం. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. వివాహ సంబంధం కుదరకపోవచ్చు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు పనిభారం.  
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. కృషి ఫలించకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. కార్యసాధనకు మరింత ఓర్పు అవసరం. సన్నిహితుల హితవు మీపై చక్కని ప్రభావం చూపుతుంది. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో మనస్పర్థలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. దైవదర్శనం సంతృప్తినిస్తుంది.
రాశి ఫలితాలు వీడియోలో చూసేందుకు దిగువ క్లిక్ చేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవరాత్రులు ఎలా వచ్చాయో తెలుసా..?