Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవరాత్రులు ఎలా వచ్చాయో తెలుసా..?

Advertiesment
నవరాత్రులు ఎలా వచ్చాయో తెలుసా..?
, శనివారం, 13 అక్టోబరు 2018 (16:12 IST)
పరమేశ్వరుడు లోకానికి ఆదిదేవుడు. ఈ స్వామివారికి పెళ్లాడానికి పార్వతీదేవి తపస్సు చేస్తారు. ఆ తపస్సుతో ప్రీతిచెంది శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటారు. పూర్వం దేవతలలో భండాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతని శివుడు భార్యయైన పార్వతీదేవిని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు పార్వతీ ఆదిపరాశక్తిగా మారి ఆ రాక్షసుని ఖండించి చంపేస్తారు.
 
అలా మెుదలైన ఈ యుద్ధం పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కొక్కరిని వధించసాగారు దుర్గాదేవి. ఆ శక్తితో ఆమె వివిధ శక్తులు నవదుర్గలుగా అవతారాలెత్తుతారు. ఆ అవతారాలే ఇవి.. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిరాత్రి అను రూపాలతో ఆమె ఆరాధనలు అందుకోసాగారు. 
 
అలానే దేవేంద్రుడు దూర్వాసుని శాపంవలన సంపదలన్నీ సముద్రంలో కలిసిపోగా.. ఈ ఆదిపరాశక్తి సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగినాడని పురోహితులు చెప్తున్నారు. అలాంటి మహామహులు, దేవతలు, సిద్ధులే అమ్మవారిని నిష్టతో ప్రార్థించి తమ అభిష్టాలను తీర్చుకోగలిగారు. ఇందులో భాగంగా.. ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తానక్షత్రములో కూడియున్న శుభదినాన ఈ దేవీ పూజలు ప్రారంభించడం మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. 
 
అందువలనే ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు. అందులో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని పెద్దలు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒంటి నిండా బంగారంతో శ్రీవారు - గరుడసేవకు ఏర్పాట్లు పూర్తి...!