Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు రాష్ట్రాలకు పండుగ కళ.. బ్రహ్మోత్సవాలు, నవరాత్రులు, బతుకమ్మ

పండుగ సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాలకు పండుగ కళ వచ్చింది. ఒకవైపు నవరాత్రులు ప్రారంభం కాగా.. మరోవైపు బతుకమ్మ పండగ మొదలైంది. అలాగే కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం అయ్యాయ

తెలుగు రాష్ట్రాలకు పండుగ కళ.. బ్రహ్మోత్సవాలు, నవరాత్రులు, బతుకమ్మ
, బుధవారం, 10 అక్టోబరు 2018 (10:38 IST)
పండుగ సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాలకు పండుగ కళ వచ్చింది. ఒకవైపు నవరాత్రులు ప్రారంభం కాగా.. మరోవైపు బతుకమ్మ పండగ మొదలైంది. అలాగే కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం అయ్యాయి. దీంతో తిరుమల కొండ భక్తజన సందోహంతో నిండిపోయింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. 
 
ఇక తిరుమలలో బుధవారం నుంచి తొమ్మిది రోజుల పాటు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. బుధవారం సాయంత్రం పెద్ద శేషవాహనంపై స్వామి వారు తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. 
 
గురువారం ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంసవాహన సేవలు జరుగనున్నాయి. 12న ఉదయం సింహ వాహనం, రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చే దేవదేవుడు, 13న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనంపై ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత  కీలకమైన గరుడోత్సవం 14న రాత్రికి జరుగనుంది. 
 
15న హనుమంత వాహనం, పుష్పపల్లకి, గజవాహన సేవలు, 16న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు, 17న స్వర్ణ రథం, అశ్వవాహన సేవల తరువాత 18న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని టీటీడీ ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం అన్నీ ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. 
 
ఇక ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, శ్రీకాళహస్తి సహా అన్ని శైవ క్షేత్రాల్లో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజామునుంచే కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-10-2018 బుధవారం దినఫలాలు - . శ్రీవారు శ్రీమతి ఆరోగ్యం పట్ల...