Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరాయి స్త్రీతో భర్త వివాహేతర లింకు.. భార్య సూసైడ్...

కట్టుకున్న భర్త తనను నిర్లక్ష్యం చేసి పరాయి స్త్రీతో పలుకుతుండటాన్ని జీర్ణించుకోలేని ఓ వివాహిత వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ దారుణం ఖమ్మం జిల్లా తల్లాడలో జరిగింది.

Advertiesment
Telangana
, సోమవారం, 8 అక్టోబరు 2018 (09:36 IST)
కట్టుకున్న భర్త తనను నిర్లక్ష్యం చేసి పరాయి స్త్రీతో పలుకుతుండటాన్ని జీర్ణించుకోలేని ఓ వివాహిత వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ దారుణం ఖమ్మం జిల్లా తల్లాడలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన అనగాని రంజిత్‌కుమార్‌తో రజిని (27) అనే మహిళకు 11 యేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. 
 
అయితే, గత కొంతకాలంగా మరో మహిళతో తన భర్త రంజిత్ కుమార్ వివాహేతర సంబంధం నడుపుతున్న విషయాన్ని రజిని కనిపెట్టింది. దీంతో భర్త వైపు నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. రంజిత్‌ కుమార్‌కు అతని తల్లి నాగమణి సహకరించడంతో ఈ వేధింపులను రజినీ తట్టుకోలేక పోయింది. 
 
ఈ క్రమంలో ఇటీవల రజిని గొల్లగూడెంలోని పుట్టింటికి వెళ్లింది. మూడో తేదీన ఆత్మహత్యకు ప్రయత్నించింది. తీవ్రంగా గాయపడిన రజినిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ మృతి చెందింది. 
 
రజిని తండ్రి గుండ్ల చిన నరసింహ ఫిర్యాదు మేరకు తల్లాడ ఎస్సై బి.తిరుపతిరెడ్డి కేసు నమోదు చేసి, శవపరీక్ష నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని నారాయణపురం తీసుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళతో సహజీవనం.. కడదాకా కలిసుంటానని.. కడతేర్చాడు...