నువ్వు ఎవరి డీపీ పెట్టుకున్నావో.. ఆయన విలువ తియ్యకు... పూనమ్ కౌర్
పూనమ్ కౌర్‌కీ, ఓ నెటిజన్‌కీ మధ్య నడిచిన మాటల యుద్ధం ట్విట్టర్‌లో సంచలనంగా మారింది. మొదట పూనమ్ ఆంధ్ర, తెలంగాణ ఫైట్ చేసుకుంటూ ఉంటే ఫాయిదా ఎవరికీ అంటూ ట్వీట్ పెట్టడంతో వివాదం మొదలైంది.
Publish Date: Sun, 07 Oct 2018 (12:52 IST)
Updated Date: Sun, 07 Oct 2018 (12:53 IST)
పూనమ్ కౌర్‌కీ, ఓ నెటిజన్‌కీ మధ్య నడిచిన మాటల యుద్ధం ట్విట్టర్‌లో సంచలనంగా మారింది. మొదట పూనమ్ ఆంధ్ర, తెలంగాణ ఫైట్ చేసుకుంటూ ఉంటే ఫాయిదా ఎవరికీ అంటూ ట్వీట్ పెట్టడంతో వివాదం మొదలైంది.
ఆంధ్ర, తెలంగాణ మన వాళ్లే ఫైట్ చేసుకుంటూ ఉంటే.. ఫాయిదా ఎవరికి అబ్బా? నాకు అయితే ఏమీ అర్థం కావట్లే.. ఇదిగో ఈ స్కూల్ స్టోరీ గుర్తుకు వచ్చిందంటూ అంటూ పిల్లీ.. పిల్లీ కొట్టుకుంటుంటే మధ్యలో కోతి లాభ పడిన ఓ కార్టూన్‌ను పోస్ట్ చేసింది.
దీనిని చూసిన ఓ నెటిజన్.. ''ఓటుకి నోటు వల్ల ఫాయిదా ఎవరికి.. కనీస మెచ్యూరిటీ లేని పొలిటికల్ ట్వీట్ ఇది... మీరు ఎంత అన్నా మీ వల్ల టీడీపీకి ఒక్క ఓటు రాదు'' అని కామెంట్ పెట్టాడు. అయితే ఆ నెటిజన్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిక్ తన డిస్‌ప్లే పిక్‌గా పెట్టుకున్నాడు.
దీంతో పూనమ్.. ''నువ్వు ఎవరి డీపీ పెట్టుకున్నావో.. ఆయన విలువ తియ్యకు. నువ్వు అసభ్యకరమైన భాషను వాడుతున్నావా? సినిమానా పంచెస్ కొట్టడానికి... నీ వ్యాఖ్యలు రోత పుట్టిస్తున్నాయి. మనం మాట్లాడిన ప్రతిదాన్ని చాలా కుటుంబాలు, ప్రజలు చూస్తున్నారు'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
webdunia
Publish Date: Sun, 07 Oct 2018 (12:52 IST)
Updated Date: Sun, 07 Oct 2018 (12:53 IST)