Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శంఖుధ్వని వినిపిస్తే...?

శంఖుధ్వని వినిపిస్తే...?
, శనివారం, 9 ఫిబ్రవరి 2019 (13:28 IST)
సాధారణంగా ఏదైనా శుభకార్యం నిమిత్తం బయలుదేరుతున్నప్పుడు గుడిలో నుండి గంటల శబ్దం వినిపించినా, మంగళవాద్యం వినిపించినా అది శుభప్రదమైనదిగా భావించి వెంటనే బయలుదేరుతుంటారు. ఈ నేపథ్యంలో కొన్నిమార్లు శంఖధ్వని కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో బయల్దేరవచ్చా .. లేదా .. అని భయంగా ఉన్నట్లైతే ఈ స్టోరీ చదవండి. 
 
ముఖ్యమైన పనిపై బయలుదేరుతున్నప్పుడు శంఖధ్వని వినిపిస్తే దానిని మంగళప్రదమైనదిగా భావించవచ్చు. శంఖం లక్ష్మీదేవి స్థానంగా చెప్పబడుతోంది. శ్రీమహావిష్ణువు సదా చక్రంతో పాటు శంఖాన్ని ధరించి దర్శనమిస్తుంటాడు. పూజా మందిరంలో శంఖం ఉండటం వలన, శంఖాన్ని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి.
 
నీరు శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందని చెప్పబడుతోందంటే శంఖానికి గల ప్రాముఖ్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. శంఖధ్వనిని మంగళప్రదమైనదిగా భావించి శుభకార్యానికి బయల్దేరినట్లైతే ఎలాంటి ఆటంకాలుండవని పండితులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పడక గదిని అమర్చుకోవడం ఎలా..?