Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోక‌స్ చిత్రంలో సుహాసిని లుక్ పోస్ట‌ర్‌

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (17:50 IST)
Focus poster
విజ‌య్ శంక‌ర్, అషూ రెడ్డి, సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జి. సూర్య‌తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్ మూవీ  ‘ఫోకస్‌’. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన క‌థ‌-క‌థ‌నాల‌తో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే విధంగా ఈ మూవీ తెరకెక్కింది.
 
ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, వేలంటైన్స్‌డే సంద‌ర్భంగా రిలీజైన పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఫోక‌స్ మూవీ నుండి సీనియ‌ర్ న‌టి సుహాసిని మ‌ణిరత్నం స్పెష‌ల్ లుక్ పోస్ట‌ర్ ను స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా..
 
విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``సూర్య‌తేజ త‌న డెబ్యూ మూవీగా రిలాక్స్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై `ఫోక‌స్` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. విజ‌య్‌శంక‌ర్, అషూ రెడ్డి హీరోహీరోయిన్లు. సుహాసిని గారు ముఖ్య పాత్ర‌లో న‌టించారు. ఇప్పుడే టీజ‌ర్ చూశాను. చాలా బాగుంది. ఇంకా మంచి పాత్ర‌లు చాలా ఉన్నాయి. అంద‌రూ  ఈ సినిమాని చూసి ఎంక‌రేజ్ చేయండి. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు జి. సూర్య‌తేజ మాట్లాడుతూ - ``నేను ద‌ర్శక‌త్వం వ‌హించిన‌ మొద‌టి చిత్రం `ఫోక‌స్`. ఈ సినిమాలోని సుహాసిని గారి లుక్ ను ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు క‌థల‌ను అందించిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గారు విడుద‌ల చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. భాను చంద‌ర్‌, షియాజీ షిండే, జీవా, సూర్య భ‌గ‌వాన్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో న‌టించారు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ. షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. మార్చిలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
 
నటీ నటులు: విజయ్‌ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని, భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, సూర్య భగవాన్‌ తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Yadagirigutta: యాదగిరిగుట్ట.. దర్శనం క్యూలైన్ గ్రిల్‌లో ఇరుక్కున్న బాలుడి తల (video)

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదం.. 179మంది సజీవదహనం

రుణం తీర్చలేదు.. బ్యాంక్ అధికారుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని, విషం తాగి కానిస్టేబుళ్ల ఆత్మహత్య.. భార్యాబిడ్డలకు కూడా..?

పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments