Webdunia - Bharat's app for daily news and videos

Install App

షికారు ట్రైల‌ర్ లోనే హిట్ క‌ళ క‌నిపిస్తుంది - వి.వి.వినాయ‌క్

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (17:42 IST)
VV Vinayak, P.S. R. Kumar, Hari Kolangani, Sai Dhansika,
నాగేశ్వ‌రి (ప‌ద్మ‌) స‌మ‌ర్ప‌ణ‌లో పి.ఎస్‌. ఆర్‌. కుమార్ (బాబ్జీ) నిర్మాత‌గా హ‌రి కొల‌గాని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా షికారు. సాయి ధ‌న్సిక (క‌బాలీ ఫేమ్‌),  తేజ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, ధీర‌జ్ ఆత్రేయ న‌వ‌కాంత్‌, ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. సాయి ల‌క్ష్మీ క్రియేష‌న్స్ బేన‌ర్‌రై పూపొందింది. శేఖ‌ర్ చంద్ర సంగీతం స‌మ‌కూర్చారు.
కాగా,  షికారు ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ వి.వి.వినాయ‌క్ చేశారు. గురువారంనాడు ప్ర‌సాద్ లేబ్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వినాయ‌క్  మాట్లాడుతూ, నేను ఆది సినిమా చేసిన‌ప్పుడు రెండు సీన్లు చూసి ఎక్కువ రేటుకు కొన్నారు బాబ్జీ. ఆయ‌న‌కు నా సినిమాపై న‌మ్మ‌కం అలాంటిది జ‌డ్జిమెంట్ బాగా తెలుసు. అప్ప‌టినుంచి ఆయ‌న ప‌రిచ‌యం కొన‌సాగుతోంది. వైజాగ్ పంపిణీదారుడుగా మంచి పేరు వుంది. ద‌ర్శ‌కుడు హ‌రి సినిమా చేయ‌డం నిర్మాత‌ను ఒప్పించ‌డం చాలా గొప్ప విష‌యం. ఎందుకంటే నిర్మాత కాంప్ర‌మైజ్ కాడు. క‌థ‌ల‌పై ఆయ‌న ప‌ట్టు అలాంటిది. ఈ సినిమా కూడా మంచివిజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంది అన్నారు.
నిర్మాత పి.ఎస్‌. ఆర్‌. కుమార్ (బాబ్జీ) మాట్లాడుతూ, హ‌రి గారు క‌థను చాలా అందంగా కామెడీగా తీర్చిదిద్దారు. మొద‌ట క‌థ చెప్ప‌గానే ఓకే చెప్పేశాను. ఇది మొద‌ల‌య్యాక‌. మూడు క‌రోనాల‌ను ఎదుర్కొన్నాం. మొట్ట‌మొదటి సినిమాకు మంచి అనుభ‌వం స‌పాదించాను. శేఖ‌ర్ చంద్ర చ‌క్క‌టి బాణీలు స‌మ‌కూర్చారు అని తెలిపారు. నాకు ప్ర‌స‌న్న‌కుమార్‌, వినాయ‌క్ వంటి వారు అంద‌రూ ఎంతో స‌హ‌క‌రించారని తెలిపారు.
 
చ‌మ‌క్ చంద్ర మాట్లాడుతూ, ఈ సినిమా ట్విస్ట్ ఇచ్చే పాత్ర‌ను పోషించాను. మంచి పాత్ర చేశాను. మంచి టీమ్‌తో ప‌నిచేసినందుకు చాలా ఆనందంగా వుంది. న‌లుగురు కుర్రాళ్ళు చేశారు. ఇంత‌కుముందు హుషారు చేశారు. ఇది మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపారు.
గీత ర‌చ‌యిత భాస్క‌ర‌భ‌ట్ల ర‌వి మాట్లాడుతూ, క‌థ ప్ర‌కారం ఇందులో పాట‌లు రాశాను. అయితే ఎక్క‌డా హీరోయిన్‌ను టార్గెట్ చేయ‌కుండా విన‌సొంపైన ప‌దాలు ప‌డ్డాయి. సాయి ధ‌న్సిక బాగా న‌టించింది. ద‌ర్శ‌క నిర్మాత‌లు మంచి స‌క్సెస్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపారు.
 
అమ్మిరాజు మాట్లాడుతూ, వైజాగ్ పంపిణీదారుడుబాబ్జీ. ఆయ‌న నేను చేసిన సినిమాలు విడుద‌ల చేసి మంచి స‌క్సెస్ ఇచ్చారు. అలాగే చిత్ర యూనిట్‌కు మంచి విజ‌యం సాధించాల‌ని కోరారు.
బెక్కెం బేణుగోపాల్ మాట్లాడుతూ, వినాయ‌క్ ఈ సినిమాను ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చారు. చాలా థ్యాంక్స్‌. బాబ్జీగారు మంచి పంపిణీదారుడు. 40 ఏళ్ళుగా ప‌రిశ్ర‌మ‌పై అనుభ‌వం వుంది. ఎన్నో ఒడిదుడుకులు త‌ట్టుకుని నిల‌బడ్డారు. అలాగే ఇందులో న‌టించిన న‌లుగురు కుర్రాళ్ళు నేను చేసిన హుషారులో చేశారు. ధ‌న్సిక బాగా న‌టించింది. ట్రైల‌ర్‌లో హిట్ క‌ళ క‌నిపిస్తోంది. తెలిపారు.
 
సాయి ధ‌న్సిక మాట్లాడుతూ, ర‌జ‌నీకాంత్ కూతురుగా క‌బాలీలో న‌టించాను. ఆ త‌ర్వాత తెలుగు సినిమాలో అవ‌కాశాలు వ‌చ్చాయి. ఈ సినిమా మంచి పాత్ర దొరికింది. ద‌ర్శ‌కుడు నిర్మాత న‌న్ను ఎంపిక చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను అని తెలిపారు.
న‌టులు  తే్‌జ్ కూర‌పాటి, అభిన‌వ్ మేడిశెట్టి, ధీర‌జ్ ఆత్రేయ న‌వ‌కాంత్ మాట్లాడుతూ, ఈ సినిమా చ‌క్క‌టి క‌థ‌తో పూర్తి వినోదాత్మ‌కంగా తెర‌కెక్కించారు. అంద‌రికీ మంచి పేరు వ‌స్తుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపారు.
ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ, బాబ్జీగారు పంపిదారుడుగా మంచి విజ‌యాలు సాధించారు. నిర్మాత‌గా తొలి ప్ర‌య‌త్నం స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను.
ద‌ర్శ‌కుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వైజాగ్‌లో షూటింగ్ .జ‌రుగుతున్న‌ప్పుడు బాబ్బీగారు వ‌చ్చి చూసేవారు. ఆయ‌న నాకు బాగా తెలుసు. క‌థ‌ల ఎంపిక‌లో మంచి అభిరుచి వుంది. షికారు హుషారులా స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అని చెప్పారు.
ద‌ర్శ‌కుడు హరి మాట్లాడుతూ, వినాయ‌క్ గారు వ‌చ్చి ఆశీర్వ‌దించ‌డం చాలా ఆనందంగా వుంది. మంచి యూత్ ఫుల్ సినిమా. ఇలాంటి క‌థ‌లు నేడు రావాలి. ప్రేక్ష‌కుడికి పుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తుంది అని తెలిపారు.
ఇంకా చిత్ర యూనిట్ పాల్గొని చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియాంక గాంధీపై ‘జాతీయ జనసేన పార్టీ’ పోటీ.. ఎవరీ దుగ్గిరాల నాగేశ్వరరావు

పవన్ 'తుఫాన్' ఎఫెక్ట్: మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకుంటున్న Mahayuti కూటమి

వాయనాడ్‌లో 48,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంకా గాంధీ

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్-బీజేపీల మధ్య పోరు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు.. ఆధిక్యంలో బీజేపీ.. ట్రెండ్స్ మారితే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments