Webdunia - Bharat's app for daily news and videos

Install App

వి లో యాక్షన్ అదరగొట్టిన సుధీర్ బాబు.!

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (20:57 IST)
యువ హీరోలు నాని - సుధీర్ బాబు కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ వి. విభిన్న కథా చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన వి సినిమా ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. నానితో అష్టాచమ్మా, జెంటిల్ మేన్, సుధీర్ బాబుతో సమ్మోహనం.. ఇలా ఇద్దరితో విజయాలు అందించిన ఇంద్రగంటి ఇప్పుడు నాని - సుధీర్ బాబు ఇద్దరినీ కలిపి సినిమా చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి వి మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.
 
థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ చేసే ఛాన్స్ లేకపోవడంతో వి మూవీ డైరెక్ట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 5న వి మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే... నాని, సుధీర్ బాబు క్యారెక్టర్ డిజైనింగ్ సూపర్ అనేలా ఉంది. ఏదైనా ఎంట‌ర్‌టైనింగ్‌గా చేయాల‌నేది నా పాల‌సీ.. ఇది సైడ్ బిజినెస్ మెయిన్ బిజినెస్ వేరే ఉంది. ఎలా ఫినిష్ చేద్దాం.. ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు మ్యాచ్ అవ‌లేద‌న్న‌ మాట రాకూడ‌దు… డైలాగ్స్ ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.
 
అయితే... ఇక్కడ సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సిక్స్ ఫ్యాక్ తో, యాక్షన్ పార్ట్ లో అదరగొట్టేసాడు. ట్రైలర్లో కనిపించిన కాసేపే అయినా... వావ్ అనిపించాడు. అతని హార్డ్ వర్క్ కళ్లకట్టినట్టు కనిపిస్తుంది. ట్రైలర్ లోనే ఇలా ఉంటే... ఇక సినిమాలో సుధీర్ బాబు చెలరేగిపోయి ఉంటాడు అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. సుధీర్ బాబు కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా వి నిలవడం ఖాయం అనిపిస్తుంది. ఇక నాని విషయానికి వస్తే.. నెగిటివ్ షేడ్లో కరెక్ట్ సెట్ అయ్యాడు అనిపించింది. ఈ ట్రైలర్‌తో ఇప్పటివరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరి.. వి ఏరేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు: పవన్ కల్యాణ్ (video)

భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరు టెక్కీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments