Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిల్ రాజు మౌనం వెనకున్న మర్మం ఏంటి..?

Advertiesment
దిల్ రాజు మౌనం వెనకున్న మర్మం ఏంటి..?
, గురువారం, 13 ఆగస్టు 2020 (15:55 IST)
యువ హీరోలు నాని - సుధీర్ బాబు కలిసి నటించిన సినిమా వి. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. అభిరుచి గల నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఉగాది కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. కరోనా రావడంతో వి మూవీ రిలీజ్ ఆగింది. ఆతర్వాత వి సినిమాని ఓటీటలో రిలీజ్ చేయనున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అలా వార్తలు వచ్చిన ప్రతిసారి వి యూనిట్ ఖండించేది.
 
ముఖ్యంగా హీరో నాని, డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ వి సినిమాని ధియేటర్లో రిలీజ్ చేయడం కోసమే చేసాం కానీ ఓటీటీలో రిలీజ్ చేయడానికి కాదు అని చెప్పారు. దీంతో వి సినిమా థియేటర్లోనే రిలీజ్ అవుతుంది అనుకున్నారు. ఇంతలో గత రెండు రోజుల నుంచి వి సినిమాని అమెజాన్లో రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 5న స్రీమింగ్ కానుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇది వాస్తవమేనా..? కాదా..? అనేది ఆసక్తిగా మారింది.
 
అయితే... దిల్ రాజు మాత్రం మౌనంగానే ఉన్నారు. దీంతో వి రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.  జనవరి వరకు సినిమాని రిలీజ్ కాకుండా ఆపాలా..? లేక ఆర్థిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ఓటీటీలో రిలీజ్ చేయాలా..? ఈ విషయంలోనే దిల్ రాజు తర్జనభర్జనపడి చివరకు ఓటీటీ రిలీజ్‌కి ఒప్పుకొని ఉంటారు అని అంటున్నారు.

ఐతే, ఇప్పటివరకు అధికారికంగా ఇంకా ఒప్పందాలు కాలేదని తెలిసింది. ఈ సినిమా శాటిలైట్ టీవీ హక్కులను దిల్ రాజు ఆల్రెడీ జెమినీ టీవీకి అమ్మేశారు. జెమినీ టీవీ, అమెజాన్ ఇంకా మాట్లాడుకోవాలి. ఇంకా కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి. అవన్నీ కొలిక్కి వస్తే… ఆ తర్వాత అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు ఛాలెంజ్ స్వీకరించిన శృతి హాసన్