Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుమంత్ 25వ సినిమా సుబ్రహ్మణ్యపురం ట్రైలర్ రిలీజ్

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (10:57 IST)
సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ త‌న 25వ చిత్రం సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం తెరకెక్కుతోంది. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈషా రెబ్బ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా వాస్త‌విక మేళ‌వింపుల‌తో మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా సాగుతుంది.


భక్తుల్ని అనుగ్రహించి వారి కోరికలు తీర్చాల్సిన దేవుడే ఆగ్రహించడానికి కారణమేమిటి? దేవుడిపై నమ్మకంలేని ఓ నాస్తికుడు దైవసంకల్పంతో తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనే అంశంపై ఈ సినిమా తెరకెక్కిందని నిర్మాతలు చెప్తున్నారు. 
 
తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే సుమంత్ నాస్తికుడిగా, దేవాలయాల మీద పరిశోధన చేసే పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఆస‌క్తిక‌ర కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం వ‌చ్చే నెల‌లో విడుద‌ల కానుంది.

శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయికుమార్, అలీ, సురేష్, మాధవి, హర్షిణి, టీఎన్‌ఆర్ తదితరులు న‌టిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌ను ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ కేశినేని నాని..?

కిడ్నీదానం చేసి భర్తను బతికించుకున్న మహిళ.. లారీ రూపంలో మృత్యువు వెంటాడింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments