Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాన్స్ సంస్కృతిని అంద‌రికీ తెలిసియేసేలా `స్టోరీస్ ఆఫ్ తెలంగాణ‌` - అమ‌ల అక్కినేని

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (16:25 IST)
mala Akkineni, Supriya Yarlingada, d. Samir Kumar and others
తెలంగాణ‌కు సంబంధించిన సంస్కృతి సంప్ర‌దాయాల‌ను `స్టోరీస్ ఆఫ్ తెలంగాణ‌` డాక్యుమెంట‌రీ ద్వారా చూపించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అమ‌ల అక్కినేని అన్నారు. పేర్ని నృత్య రూప‌క‌ర్త డా. న‌ట‌రాజ రామ‌కృష్ణ 100వ జ‌యంతి సంద‌ర్భంగా మార్చి 21 సోమ‌వారం 30 నిముషాల నిడివిగ‌ల‌ డాక్యెమెంట‌రీని ప‌లువురుకి ప్ర‌ద‌ర్శించారు. ఇది కాన్సెప్ట్ క్రియేట‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్  డి. స‌మీర్ కుమార్ ఆధ్వ‌ర్యంలో రూపొందింది. సుప్రియ యార్ల‌గ‌డ్డ దీనిని నిర్మించారు. ఈ సంద‌ర్భంగా అన్న‌పూర్ణ స్టూడియో మినీ థియేట‌ర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి అమ‌ల అక్కినేని హాజ‌ర‌య్యారు.
 
అనంత‌రం అమ‌ల అక్కినేని మాట్లాడుతూ, క్ర‌మ‌శిక్ష‌ణ‌, మ‌న‌లోని అంత‌ర్‌శ‌క్తికి డాన్స్ అనే ప్రక్రియ చ‌క్క‌టి ఫ్లాట్‌ఫామ్ లాంటిది. క‌ళ అనేది బ‌తికున్నంత‌కాలం డాన్స్ వుంటుంది. రుక్ష్మిణీదేవి చెప్పిన‌ట్లు, డాన్స్ అనేది యోగ లాంటిది. మ‌న‌లోని సామ‌ర్థ్యం, శ‌క్తిని వెలికితీయ‌డ‌మేకాకుండా జీవితంలో ఉన్న‌తంగా ఎలా వుండాల‌నేది తెలియ‌జేస్తుంది. చాలామంది కంప్యూట‌ర్ ముందు కూర్చున్న‌వారు కానీ ఇత‌ర‌త్రా కానీ ప్ర‌స్తుతం ఒత్తిడికి గుర‌వుతున్నారు. ఇలాంటి వారు డాన్స్ చేస్తే అద్భుతంగా యోగ చేసిన‌ట్లుగా వుంటుంది. నా వ‌య‌స్సువారు చేయ‌లేక‌పోయినా యువ‌త ఇది అల‌వ‌ర్చుకోవాలి. డాన్స్ పై డాక్యుమెంట‌రీ చేయ‌డం, అందులోనూ అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మించ‌డానికి ముందుకు రావ‌డం చాలా గొప్ప‌విష‌యం.  మ‌న సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ తెలియ‌జేసేలా స‌మీర్ చేసిన ప్ర‌యోగం అభినంద‌నీయం. ఇంత‌కుముందు స‌మీర్ `మోక్ష‌` అనే షార్ట్ ఫిలిం చేశాడు. డాన్స్‌, సినిమా అనేవి ఒక‌దానికి ఒక‌టి స‌మ‌న్వ‌యం అయివుంటాయి. నేను క‌ళాక్షేత్రంలో గ్రాడ్యుయేట్ చేస్తుండ‌గా, చాలా మంది సినిమావైపు మొగ్గారు. నేను డాన్స్‌ను సెల‌క్ట్ చేసుకున్నాన‌ని తెలిపారు.
 
అన్న‌పూర్ణ ఫిలిం స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన స‌మీర్‌, ధృవ‌, హ‌లో, అల వైకుంఠ‌పురం వంటి ప‌లు సినిమాల‌కు ప‌నిచేశారు. ఈ డాక్యుమెంట‌రీకి కాన్సెప్ట్, క్రియేట‌ర్‌- డి. స‌మీర్ కుమార్‌, నిర్మాత‌- సుప్రియ యార్ల‌గ‌డ్డ‌, ఎడిట‌ర్‌- సాయి ముర‌ళీ, సంగీతం- క‌ళ్యాణ్ నాయ‌క్‌, సినిమాటోగ్ర‌పీ- డి. సుమీర్ కుమార్‌, సౌండ్ డిజైన్‌- మ‌హేష్‌, వి.ఎప్‌.ఎక్స్‌.- అనిల్‌, క్రియేటివ్ నిర్మాత‌- మ‌హేశ్వ‌ర్ రెడ్డి గోజ‌ల‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments