Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అణు బంకర్లకు పుతిన్ మొదటి భార్య పిల్లలు, ప్రేయసి: అణ్వాయుధ వాహనాలను తరలిస్తున్న ఇంగ్లండ్

Advertiesment
అణు బంకర్లకు పుతిన్ మొదటి భార్య పిల్లలు, ప్రేయసి: అణ్వాయుధ వాహనాలను తరలిస్తున్న ఇంగ్లండ్
, సోమవారం, 21 మార్చి 2022 (16:18 IST)
ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పినట్లే మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా? జరుగుతున్న పరిణామాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్ ఖండాంతర అణు క్షిపణులతో దాడి చేయగల వార్ హెడ్లను పలు కీలక ప్రాంతాలకు తరలించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 
మరోవైపు అణ్వాయుధ దాడి జరిగిన సమయంలో ఎలా స్పందించాలన్న దానిపై కసరత్తు చేయండంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ సైనిక జనరల్స్‌కు ఆదేశాలు జారీ చేసారు. దీనితో నాటో దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇంగ్లండ్ తన అణ్వాయుధ వాహన శ్రేణిని సమాయత్తం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.

 
ఇంకోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మానసిక పరిస్థితి అంతగా బాగోలేదనీ, గత రెండేళ్లుగా కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో తన బంగ్లాకే పరిమితమైన పుతిన్ భిన్నంగా ఆలోచిస్తున్నారంటూ ఆంగ్ల పత్రిక డెయిలీ మెయిల్ పేర్కొంది. ఇదిలావుంటే తన మొదటి భార్య పిల్లల్ని, తన ప్రేయసితో పాటు ఆమె సంతానాన్ని అత్యంత కట్టుదిట్టమైన అణు బంకర్లకు పుతిన్ తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. 

 
ఉక్రెయిన్ దేశానికి నాటో దేశాలు పరోక్షంగా సాయపడుతున్నాయంటూ రష్యా ఆరోపిస్తోంది. దీనితో ఉక్రెయిన్ పైన రష్యా చేస్తున్న యుద్ధం ఓ పట్టాన విజయం దిశగా సాగటంలేదు. దీనితో పుతిన్ తీవ్ర ఆగ్రహంతో వున్నారనీ, తన వద్దకు వచ్చేవారిపై కేకలు వేస్తున్నారంటూ ఆంగ్ల పత్రిక పేర్కొంది.


ఇదిలావుంటే రష్యా వద్ద సుమారు 2 వేల పైచిలుకు అణ్వస్త్రాలు వున్నట్లు అంచనా. రష్యా వాటిని పూర్తిస్థాయి ప్రయోగిస్తే పరిస్థితి దారుణంగా మారుతుంది. యుద్ధం ముగించి చర్చలకు వెళ్లే ఆలోచన కనబడటంలేదు. దీనితో పరిస్థితి ఎలా దారితీస్తుందోనని పశ్చిమ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పగో జిల్లా జంగారెడ్డిగూడెంకు తెదేపా ఎమ్మెల్యేలు