Webdunia - Bharat's app for daily news and videos

Install App

GA 2 పిక్చర్స్ నిర్మిస్తున్న కోటబొమ్మాలి పిఎస్ నుంచి శ్రీకాకుళం ఫోక్ సాంగ్

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (13:47 IST)
Kotabommali PS
తెలుగులో అనేక సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందుకుంది గీతా ఆర్ట్స్ 2 సంస్థ. GA2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు నిర్మించగా కొన్ని ఇతర భాషలు సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ లనుఅందుకున్నారు.తాజాగా మలయాళ సూపర్ హిట్ నాయాట్టు కి రీమేక్ గా కోట బొమ్మాళి పిఎస్ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.
 
ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు కోట బొమ్మాళి PS మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు 
 
మేకర్స్. మాస్సీ శ్రీకాకుళం ఫోక్లోర్ ఫస్ట్ సింగిల్  సెప్టెంబర్ 11న విడుదలవుతుందని ఈరోజు  ప్రకటించారు. ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో ఈ అప్డేట్ అందించారు. పూర్తిస్థాయి ఫోక్ సాంగ్ తో రానున్న ఈ పాట ప్రేక్షకుల్ని అలరిస్తుందని అన్నారు దర్శకర్మాతలు. జోహార్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న  తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
 
తారాగణం: శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మరియు అనేక ఇతర ప్రముఖ నటీనటులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments