Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరలక్ష్మి శరత్‌కుమార్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలలో కోట బొమ్మాళి

Kota bommali
, సోమవారం, 31 జులై 2023 (09:59 IST)
Kota bommali
వినోదభరితమైన కంటెంట్‌ని అందించే కొన్ని నిర్మాణ సంస్థల్లో GA 2 పిక్చర్స్ ఒకటి. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రొడక్షన్ ప్రొడక్షన్ హౌస్ ఇదివరకే "భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించారు.
 
ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ప్రొడక్షన్ నెం.8 గా "కోట బొమ్మాళి P.S" అనే సినిమా రానుంది. ఇది రాజకీయాలు మరియు పోలీసుల మధ్యజరిగే పరిణామాలు ఉన్న కథ. నిర్మాతలు బన్నీ వాస్, విద్యా కొప్పినీడికి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించడంలో ఇదివరకే మంచి అనుభవం ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులు కూడా అదే అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరో, నటుడు శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రధాన నటీనటులతో పాటు రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ సహా ఇతర టాలెంటెడ్ టాలీవుడ్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ప్రొడక్షన్ నంబర్ 8 చాలా రోజులు క్రితం స్టార్ట్ అయింది. ఇప్పటికే విడుదలైన ప్రధాన పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్‌లు ప్రేక్షకుల క్యూరియాసిటీని పెంచాయి. ఇప్పుడు ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన పవర్‌ఫుల్ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ ప్రకటించారు. చిత్రం కోసం "కోట బొమ్మాళి పి.ఎస్" అనే ఆసక్తిని రేకెత్తించే టైటిల్‌ని లాక్ చేసి, శ్రీకాంత్, రాహుల్ విజయ్ మరియు శివానీ రాజశేఖర్‌లను పోస్టర్ లో రివీల్ చేసారు.
 
మోషన్ పోస్టర్ క్రియేటివ్‌గా రూపొందించబడింది. చిత్రం యొక్క ఆకట్టుకునే కథను సూచిస్తుంది. ఇది "పరారిలో కోట బొమ్మాళి పోలీసులు" అనే టెక్స్ట్‌తో ఫ్లైయర్‌తో ప్రారంభమవుతుంది మరియు రాజకీయాలు మరియు పోలీసు బలగాలకు సంబంధించిన తుపాకులు, బ్యాలెట్ పేపర్లు, కరపత్రాలు మరియు మరెన్నో అంశాలను చూపించి, టైటిల్‌ను రివీల్ చేసారు.
 
టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్నాయి. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. గతంలో జోహార్, అర్జున ఫాల్గుణ చిత్రాలను రూపొందించిన తేజ మార్ని దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కొంత మంది టాప్ టెక్నీషియన్లు డిఫరెంట్ క్రాఫ్ట్‌లను హ్యాండిల్ చేస్తున్నారు. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గరుడ గమన వృషభ వాహనం మరియు రోర్‌షాచ్ ఫేమ్ రంజిన్ రాజ్ మరియు మిధున్ ముకుందన్ సంగీతం సమకూర్చారు. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
 
తారాగణం: శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మరియు అనేక ఇతర ప్రముఖ నటీనటులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొరగని కుక్క - లోపం చెప్పన నోరు.. ఈ రెండూ లేని ఊరు ఉండదు : రజనీకాంత్