Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుధీర్‌బాబు హంట్‌ సినిమా ఎలా వుందంటే!

hunt poster
, గురువారం, 26 జనవరి 2023 (15:08 IST)
hunt poster
నటీనటులు: సుధీర్ బాబు, శ్రీకాంత్ మేక, భరత్ నివాస్, మైమ్ గోపి, కబీర్ సింగ్, రవివర్మ
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెంట్, సంగీత దర్శకులు: జిబ్రాన్,  ఎడిటర్: ప్రవీణ్ పూడి, నిర్మాత: వి ఆనంద ప్రసాద్,  దర్శకుడు : మహేష్ సూరపనేని .
 
కథ:
అసిస్టెంట్‌ పోలీసు కమీషనర్‌ ఆర్యన్‌ దేవ్‌ (భరత్‌) హత్య కేసును అదే హోదా వున్న అర్జున్‌ ప్రసాద్‌ (సుధీర్‌ బాబు) డీల్‌ చేస్తుంటాడు. ఆ క్రమంలో అసలు హంతకులు ఎవరనేది తెలిసిపోయిందని తన ప్రయాణిస్తున్న కారులోంచి అర్జున్‌ ప్రసాద్‌ మరో అధికారి శ్రీకాంత్‌కు ఫోన్‌ చేస్తాడు. సరిగ్గా ఆ టైంలో కారు యాక్సిండెంట్‌కు గురయి ప్రాణాపాయం నుంచి బయటపడి గతాన్ని మర్చిపోతాడు అర్జున్‌ ప్రసాద్‌. ఆ తర్వాత ఇప్పటి అర్జున్‌ ప్రసాద్‌ ఆ కేసును కంటెన్యూ చేశాడా? లేదా? ఈ ప్రోసెస్‌లో అర్జున్‌ ప్రసాద్‌ పై పై అధికారుల ఒత్తిడి ఎలా వుంది? చివరికి అసలు హంతకుడు ఎవరు? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
 
విశ్లేషణ:
పోలీసు అధికారిగా సుధీర్‌బాబు బాగా సూటయ్యాడు. హత్య పరిశోధనలో ఎదురయ్యే సమస్యలు వాస్తవంగా చూపించారు. ఈ సినిమాలోనూ సుధీర్‌బాబు ఫిట్‌నెస్‌ చూపించాడు. క్రైమ్‌ సినిమాల్లో వుండాల్సిన సస్పెన్స్‌ ఈ సినిమాలోనూ వుంది. క్లయిమాక్స్‌లో సుధీర్‌బాబు తన గురించి తాను తెలుసుకొనే క్రమంలో ఆయన పలికించిన నటన నటుడిగా జీవించాడనే చెప్పాలి. అదేవిధంగా శ్రీకాంత్‌, భరత్ పాత్రలు పరిధిమేరకు బాగున్నాయి. ఇతర పాత్రలు మైమ్‌ గోపి, కబీర్‌సింగ్‌ పాత్రలు ఓకే. 
 
దర్శకుడు మహేష్‌ కొత్తవాడైనా పోలీస్‌ అధికారి మర్డర్‌ మిస్టరీ కథను తీయడంలో సాహసం చేశాడనే చెప్పాలి. అయితే ఎక్కడా బోర్‌ కొట్టకుండా తగు జాగ్రత్త పడ్డాడు. ఓ దశలో గతంలో వచ్చిన ఓ సినిమా స్పురించినా తన శైలిలో  వెళ్లిపోయాడు. పరిమితమైన నటీనటులు, పరిమిత సంభాషణలతో రాణించాడు. ఒక్కోసారి సీరియస్‌గా సాగే సన్నివేశాలు మరోసారి ఠక్కున పడిపోతాయి. టెర్రరిజంతో ఎటాక్‌ చేసే సన్నివేశాలు యాక్షన్‌ హీరోగా సుధీర్‌బాబుకు మంచి మార్కులు పడ్డాయి. కొన్నిచోట్ల సినిమాటిక్‌గా సన్నివేశాలను ఫ్రీడమ్‌ తీసుకున్నాడు దర్శకుడు. 
 
దర్శకుడు తీసుకున్న అంశం బాగున్నా రివర్స్‌ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ క్రమంలో మరింత బలంగా కథను రాసుకొంటే బాగుండేది. ఇలాంటి సినిమాకు నేపథ్య సంగీతం ప్రాణం. దానిని జిబ్రాన్‌ బాగా ఇచ్చాడు. కెమెరామెన్‌ అరుల్‌ విన్సెంట్‌ తగువిధంగా తీర్చిదిద్దాడు. భవ్య క్రియేషన్స్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి.
 
ఇలాంటి కథకు ఊహించని మలుపులు వుంటే రక్తికడుతుంది. అది ముగింపులోకానీ ప్రేక్షకుడికి తెలీదు. అదే సినిమాకు బలం. ఇటువంటి పాత్రను చేసిన సుధీర్‌బాబును అభినందించాల్సిందే.  నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేయాలనే తపన ఆయనలో కనిపించింది. ఇలాంటి కథకు హీరో పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కథను హీరోయిజంవైపు తీసుకెళితే మరింత బాగుండేది. ఏదిఏమైనా సరికొత్తప్రయోగంతో చేసిన ఈ ప్రయత్నం అభినందించదగిందే. ఇటీవలే వైవిధ్యమైన కథలు వస్తున్న తరుణంలో దర్శక నిర్మాతలు చేసిన కొత్త ప్రయోగం.
రేటింగ్‌: 2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా... ఒకటి ఎంజాయ్ చేశాక మరొకటి ఇవ్వమ్మా : రాజమౌళి ట్వీట్