Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాత్రూమ్‌లో కుప్పకూలడం వల్లే శ్రీదేవి చనిపోయిందా?

అందాల సుందరి శ్రీదేవి మరణంపై ఓ వార్త ట్రెండ్ అవుతోంది. నిజానికి ఆమె గుండెపోటుతో మరణించారన్నది ప్రచారంలో ఉంది. భర్త బోనీకపూర్ బంధువు వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌‌కు వెళ్లగా, అక్కడ ఆమె గు

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (20:36 IST)
అందాల సుందరి శ్రీదేవి మరణంపై ఓ వార్త ట్రెండ్ అవుతోంది. నిజానికి ఆమె గుండెపోటుతో మరణించారన్నది ప్రచారంలో ఉంది. భర్త బోనీకపూర్ బంధువు వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌‌కు వెళ్లగా, అక్కడ ఆమె గుండెపోటుకు గురై కన్నుమూశారు. 
 
అయితే, ఆమె మరణానికి ముందు కొన్ని అసలేం జరిగిందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శనివారం రాత్రి నవ్వుతూ బాత్రూమ్‌‌కు వెళ్లిన శ్రీదేవి గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయినట్లు వినికిడి. ఒక్కసారిగా ఆమె కేకలు విన్న కుటుంబీకులు బాత్రూమ్ తలుపులు బద్ధలు కొట్టి హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. 
 
శ్రీదేవి మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీదేవి బాత్రూమ్‌‌కు వెళ్లడం.. నిమిషాల్లోనే ఈ దుర్ఘటన జరగడంతో శ్రీదేవి కుటుంబీకుల నోటమాటరాలేదు. అందుకే ఈ ఘటన జరిగిన గంటకుగానీ వార్త బయటకు చెప్పలేదు. చివరకు బోనీకపూర్ సోదరుడు సంజయ్ కపూర్‌‌ శ్రీదేవి మరణించినట్లు ధృవీకరించారు. అయితే గతంలో ఆమెకు ఎప్పుడూ గుండెపోటు రాలేదని ఆయన చెబుతూ కంటతడిపెట్టారు.
 
ఇదిలావుండగా, దుబాయ్ నుంచి రాత్రి 7గంటలకు శ్రీదేవి భౌతికకాయం ముంబైకు తీసుకొచ్చి, సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు ముందు శ్రీదేవి నుంచి మెహబూబా స్టూడియోలో అభిమానులు, నటీనటులు చూసేందుకు ఉంచుతారు. ప్రముఖుల నివాళుల తర్వాత జూహులోని శాంతాక్రజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments