Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''మహానటి'' శ్రీదేవికి అంకితం.. కాంగ్రెస్ ట్వీట్.. చీవాట్లు తప్పలేదు.. ఎందుకని?

బాల‌న‌టిగా ప‌రిచ‌య‌మై ఆల్ ఇండియా సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన సినీ లెజండ్ శ్రీదేవి.. గుండెపోటుతో అకాల మరణం చెందారు. శ్రీ‌దేవితో ఆఖ‌రి పోరాటం, జ‌గ‌దేక వీరుడు - అతిలోక సుంద‌రి, గోవిందా గోవింద వంటి చిత్రాల‌ను

''మహానటి'' శ్రీదేవికి అంకితం.. కాంగ్రెస్ ట్వీట్.. చీవాట్లు తప్పలేదు.. ఎందుకని?
, ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (17:44 IST)
బాల‌న‌టిగా ప‌రిచ‌య‌మై ఆల్ ఇండియా సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన సినీ లెజండ్ శ్రీదేవి.. గుండెపోటుతో అకాల మరణం చెందారు. శ్రీ‌దేవితో ఆఖ‌రి పోరాటం, జ‌గ‌దేక వీరుడు - అతిలోక సుంద‌రి, గోవిందా గోవింద వంటి చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాత‌ సి.అశ్వ‌నీద‌త్‌.. న‌టీమ‌ణి సావిత్రిపై తెర‌కెక్కిస్తున్న తన తాజా చిత్రం ''మ‌హాన‌టి''ని శ్రీ‌దేవికి అంకితం చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శ్రీదేవి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో నటి శ్రీదేవి మృతిపై స్పందించిన నేషనల్ కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్ ట్విస్ట్‌తో తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్‌ చేసి నాలుక కర్చుకుంది. కాంగ్రెస్ ట్వీట్ చేసిన కొద్దిక్షణాల్లోనే ఆ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో వెంటనే కాంగ్రెస్ ఆ ట్వీట్‌ను తొలగించింది.
 
2013లో యూపీఎ హయాంలోనే శ్రీదేవి పద్మశ్రీ అవార్డును అందుకున్నారని తన ట్వీట్‌లో చెప్పడంతో.. శ్రీదేవికి ఇచ్చిన అవార్డుల్లో రాజకీయాలు అవసరమా.. ఆమె లోకం విడిచి వెళ్లినా రాజకీయాల్లేంటని నెటిజన్లు ఫైర్ కావడంతో కాంగ్రెస్ ఆ ట్వీట్‌ను తొలగించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవి గురించి రామ్ గోపాల్ వర్మ లాస్ట్ ట్వీట్.. ఏమన్నాడంటే?