Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జామురాతిరి జాబిలమ్మకు శాశ్వతంగా జోలపాట.. ఐ హేట్ గాడ్ : రాంగోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అమితంగా ప్రేమించే హీరోయిన్ శ్రీదేవి. ఆమె ఇకలేరన్న వార్తను ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశారు. దేవుణ్ణి ఎప్పుడు ఇంత‌లా ద్వేషించ‌లేదన్నారు.

Advertiesment
Ram Gopal Varma
, ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (11:02 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అమితంగా ప్రేమించే హీరోయిన్ శ్రీదేవి. ఆమె ఇకలేరన్న వార్తను ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశారు. దేవుణ్ణి ఎప్పుడు ఇంత‌లా ద్వేషించ‌లేదన్నారు. కాంతికన్నా ఎక్కువ ప్రకాశవంతమైనది.. నేడు మనకు దూరమైంది.. లోకం విడిచిపోయిన శ్రీదేవి అంటే తనకు చాలా కోపం వస్తుంది.. శ్రీదేవి ఏ లోకంలో ఉన్నా.. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ తన ఆరాధ్య దేవతకు నివాళులు అర్పించారు. 
 
ఆమె భర్త బోనీ కపూర్ గురించి ఆలోచిస్తేనే చాలా ఆవేదనగా ఉందని, శ్రీదేవి నిజంగానే చనిపోయిందా? ఎవరైనా నన్ను నిద్రలేపి.. ఇదొక పీడకల మాత్రమే అని చెప్పగలరా? అంటూ శ్రీదేవి మరణంపై తన బాధను రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ చేశారు.
 
అస‌లు అందరినీ ఇలా వదిలేసి ఆమె ఒంటరిగా ఇలా ఎలా వెళ్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేను మిమ్మల్ని ఇంతగా నవ్వించిన తర్వాత కూడా.. మీరు నన్ను ఇంతగా ఏడిపించడం కరెక్టా? అంటూ గతంలో శ్రీదేవితో కలసి ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.
 
ఈ సారి ఆ దేవుడే ఒక జామురాతిరి ఆ జాబిలమ్మకు శాశ్వతంగా జోలపాడాడు.. తన జాజి కొమ్మను ఎక్కువకాలం భూలోకంలో ఉంచలేక శాశ్వతంగా తన దరికి చేర్చుకున్నాడంటూ ఆర్జీవీ ట్వీట్ చేస్తూ శ్రీదేవి ఫోటోను పోస్ట్ చేశాడు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతిలోకసుందరి జీవితంలోని మరపురాని ఘట్టాలు...