మధును చంపేసిన సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా : సెహ్వాగ్
బడాబాబులు దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయి.. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇలా దేశాన్ని నిలువునా దోచుకోవడంలో ఆ ఇద్దరు మోడీలు, ఒక మాల్యాను మంచినవారు లేరు.
బడాబాబులు దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయి.. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇలా దేశాన్ని నిలువునా దోచుకోవడంలో ఆ ఇద్దరు మోడీలు, ఒక మాల్యాను మంచినవారు లేరు. వారు ఎవరో కాదు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా. ఈ ముగ్గురు కలిసి రూ.50 వేల కోట్లకుపైగా దోచుకున్నారు.
ఇలాంటివారు విదేశాల్లో హాయిగా నిద్రపోతున్నారు. కానీ, ఆకలి కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్లని మాత్రం జనాలు చంపేస్తున్నారు. ఆకలి వేసి ఓ కేజీ బియ్యం దొంగతనం చేసినందుకు మధు అనే వ్యక్తిని ఇటీవల దారుణంగా గాయపరిచి చంపేసిన విషయం తెలిసిందే. కొంతమంది విద్యావంతులు కూడా మధును రక్షించకపోగా.. గాయాలతో ఉన్న అతనితో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.
తాజాగా ఈ ఘటనపై సెహ్వాగ్ అసహనం వ్యక్తంచేశాడు. మధును చంపేసిన సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాంటూ ట్వీట్ చేశాడు. 'మధు కేవలం ఒక కేజీ బియ్యం దొంగిలించాడు. అందుకే ఆ పేద గిరిజన వ్యక్తిని ఉబైద్, హుస్సేన్, కరీమ్ అనే వ్యక్తులతో కూడిన గుంపు చంపేసింది. ఇది సమాజానికి మాయని మచ్చ. ఇంత ఉన్నత సమాజంలో ఈ ఘటన జరిగినందుకు నేను సిగ్గుపడుతున్నాను' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.