Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ను వీడనున్న శ్రీరెడ్డి... తమిళ తంబీలు 'క్యూ' కడుతున్నారట...

క్యాస్టింగ్ కౌచ్‌ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన నటి శ్రీరెడ్డి. ఈమె త్వరలోనే తన మకాంను మార్చనుంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగరాన్ని శాశ్వతంగా వీడాలని ఆమె భావిస్తున్నారు. దీనికి బలమైన కారణాలు లేకపోలేదు

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (10:38 IST)
క్యాస్టింగ్ కౌచ్‌ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన నటి శ్రీరెడ్డి. ఈమె త్వరలోనే తన మకాంను మార్చనుంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగరాన్ని శాశ్వతంగా వీడాలని ఆమె భావిస్తున్నారు. దీనికి బలమైన కారణాలు లేకపోలేదు. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో తెరవెనుక జరుగుతున్న చీకటి బాగోతాలను శ్రీరెడ్డి బహిర్గతం చేసింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు.. మెగా కుటుంబంపై లేనిపోని విమర్శలు చేసి చిక్కులు తెచ్చుకుంది. ఈ విషయంలో శ్రీరెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
 
ఆ తర్వాత ఆమె గత కొన్ని రోజులుగా చెన్నైలో ఉంటోంది. ఇక్కడ తరచూ మీడియాను మీట్ అవుతూ తన మనసులోని అంశాలను వెల్లడిస్తోంది. పైగా, కోలీవుడ్‌లోని పలువురిపై కూడా ఆమె క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. 
 
ఈ నేపథ్యంలో తన జీవిత చరిత్రపై రెడ్డి డైరీ పేరుతో ఓ చిత్రాన్ని తీయనుంది. ఈ చిత్రానికి అల్లావుద్దీన్ అనే వ్యక్తి దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది కూడా. 
 
ఈ నేపథ్యంలో నటి శ్రీరెడ్డి హైదరాబాదుకు గుడ్‌బై చెప్పబోతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నగరాన్ని శాశ్వతంగా వీడి, చెన్నైలో స్థిరపడాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాదులో తనకు రక్షణ లేదని ఆమె తెలిపింది. 
 
తెలుగు పరిశ్రమను మూడు కుటుంబాలు శాసిస్తున్నాయని చెప్పింది. మరోవైపు, తమిళ సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులపై కూడా శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అక్కడ ఆమె ఎంత మేరకు స్థిరపడతారో వేచిచూడాల్సిందే. ఇప్పటికే ఆమెపై పలువురు హీరోలు గుర్రుగా ఉన్నారు కూడా. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments