Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీరెడ్డి బయోపిక్ వచ్చేస్తోంది.. సినిమా పేరు, దర్శకుడు ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో శ్రీరెడ్డి పేరు వింటేనే చాలామంది జడుసుకుంటున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లోకి సైతం ఈ ఫీవర్ పాకింది. దర్శకనిర్మాతలు, హీరోలు శ్రీరెడ్డి పేరు వింటేనే వామ్మో అనుకుంటున్నారు. ఇందుకు కారణం.. క్యాస్

శ్రీరెడ్డి బయోపిక్ వచ్చేస్తోంది.. సినిమా పేరు, దర్శకుడు ఎవరో తెలుసా?
, మంగళవారం, 21 ఆగస్టు 2018 (10:16 IST)
టాలీవుడ్‌లో శ్రీరెడ్డి పేరు వింటేనే చాలామంది జడుసుకుంటున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లోకి సైతం ఈ ఫీవర్ పాకింది. దర్శకనిర్మాతలు, హీరోలు శ్రీరెడ్డి పేరు వింటేనే వామ్మో అనుకుంటున్నారు.


ఇందుకు కారణం.. క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమె అర్ధనగ్న ప్రదర్శన చేయడం. ఇంకా దర్శకులను ఏకిపారేయడం, ఆధారాలున్నాయని బాంబు పేల్చడం వంటివే. క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్, కోలీవుడ్‌లో కలకలం సృష్టించిన శ్రీరెడ్డిపై ప్రస్తుతం బయోపిక్ తెరకెక్కనుంది. 
 
ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్‌లలో బయోపిక్‌ల పర్వం నడుస్తున్న తరుణంలో.. శ్రీరెడ్డి జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ వివరాలను తమిళనాడు రాజధాని చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీరెడ్డి వెల్లడించింది. 
 
ఈ సినిమా పేరును ''రెడ్డి డైరీ''గా పెట్టినట్లు తెలిపింది. తనను మోసం చేసిన వ్యక్తులకు సంబంధించి తనవద్ద ఉన్న వీడియోలను ఈ బయోపిక్ సినిమాలో చూపెడతానని ఆమె చెప్పింది. ఈ సినిమాకు అల్లావుద్దీన్ దర్శకత్వం వహిస్తారని చెప్పుకొచ్చింది. 
 
ఈ సందర్భంగా తనను మోసగించిన వారికి సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద వున్నాయని శ్రీరెడ్డి తెలిపింది. సరైన సమయం వచ్చినప్పుడు అన్నింటిని బయటపెడతానని హెచ్చరించింది. తాను నటించిన ''రెడ్డి డైరీ'' సినిమాకు సహకరిస్తామని నడిగర్ సంఘం హామీ ఇచ్చిందని శ్రీరెడ్డి తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎలాంటి సాయం కావాలో చెప్పండి.. ఫ్యాన్స్‌ను కోరుతున్న కీర్తి సురేష్