Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై 2 బ‌యోపిక్‌లు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమా రూపొంద‌నున్న విష‌యం తెలిసిందే. నాన్న, కణం చిత్రాల దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. జ‌య‌ల‌లితి జ‌యంతి రోజు ఈ సినిమాని ప్ర

Advertiesment
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై 2 బ‌యోపిక్‌లు
, సోమవారం, 20 ఆగస్టు 2018 (14:32 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమా రూపొంద‌నున్న విష‌యం తెలిసిందే. నాన్న, కణం చిత్రాల దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.  ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. జ‌య‌ల‌లితి జ‌యంతి రోజు ఈ సినిమాని ప్రారంభించ‌నున్నారు. జ‌య‌ల‌లిత పాత్ర‌ను విద్యాబాల‌న్, న‌య‌న‌తార‌, కీర్తి సురేష్ ఈ ముగ్గురిలో ఎవ‌రో ఒక‌రు పోషించ‌నున్నారు. త్వ‌ర‌లోనే జ‌య‌లలిత పాత్ర పోషించే హీరోయిన్‌ని ఫైన‌ల్ చేయ‌నున్నారు.
 
కాగా ఈ సినిమా ప్రకటన వచ్చిన కొన్ని రోజుల్లోనే జయలలితపై మరో బయోపిక్ తెరమీదికి రావడం విశేషం. అవును.. జ‌య‌ల‌లితపై మ‌రో బ‌యోపిక్ రెడీ అవుతోంది. తమిళ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా ఈ సినిమాని డైరెక్ట్ చేయ‌నున్నారు. 77 ఏళ్ల భారతీరాజా దర్శకుడిగా సినిమా చేసి చాలా కాలమైంది. ఆయన చివరగా 2013లో అన్నకొడి అనే సినిమా తీసారు. 
 
ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు ఈ సినిమాని తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆదిత్య భరద్వాజ్ అనే నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాడట. ఈ చిత్రానికి సంగీతం అందించడం కోసం ఇళయరాజాను సంప్రదిస్తున్నారని తెలిసింది. మరి ఈ చిత్రంలో జయలలితగా ఎవరు నటిస్తారో..? ప్రేక్ష‌కులు ఏ సినిమాని ఆద‌రిస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హీరోయిన్‌ను వెంటాడుతున్న దురదృష్టం