Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవిష్ణును కమల్ హాసన్ తో పోల్చలేదు - కథ ప్రకారమే నాలుగు పాత్రలు చేశాడు : డైరెక్టర్ హసిత్ గోలి

డీవీ
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (17:12 IST)
Director Hasit Goli
కథానాయకుడు శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్ లో రాజరాజ చోర వచ్చింది. ఇప్పుడు రెండో సినిమా 'శ్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ హసిత్ గోలి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
- ఇందులో డిఫరెంట్ జనరేషన్స్ టచ్ చేశాం. సింగా క్యారెక్టర్ ప్రజెంట్ జనరేషన్. అలాగే 90కి సంబంధించిన క్యారెక్టర్ ఉంటుంది. దాని కంటే ముందుకు వెళితే 70కి సంబంధించిన క్యారెక్టర్ ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే.. మూల పురుషుడికి సంబంధించినంత వరకు వెళ్దాం అనే ఆలోచనతో చేసిన స్క్రిప్ట్ ఇది. రాజులకు సంబంధించిన క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు ఇంగ్లీష్ అవసరం పడదు. అక్కడ స్వచ్ఛమైన తెలుగ ఉంటుంది. ఇందులో అచ్చ తెలుగు విషయాలే ఉన్నాయి. అలాగే రూటేడ్ కల్చర్ ఉంది. ఇది ఒక వంశానికి సంబంధించిన కథ. ప్రతి జనరేషన్ లో విష్ణు గారి క్యారెక్టర్ ఉంటుంది.
 
- ఇందులో నాలుగు జనరేషన్ కు చెందిన పాత్రలు శ్రీ విష్ణు పోషించారు. శ్వాగ్ వంశీయులలోని తరాల కథే ఇది. ఓ సందర్భంగా శ్రీవిష్ణును కమల్ హాసన్ తో పోల్చలేదు. ఆయనకున్న నటనలో కసి వుంది. ఎలాంటి పాత్రలైనా పోషించే సత్తా శ్రీ విష్ణుకు వుందని మాత్రమే చెప్పాను. నాలుగు క్యారెక్టర్స్ లో స్పష్టమైన వ్యత్యాసం చూపించాలని మొదటి నుంచి అనుకున్నాం. భారతీయుడు లాంటి సినిమాలు చేసిన నేషనల్ అవార్డు విన్నర్ రషీద్ గారు  దీనికి ప్రోస్తస్టిక్స్ చేశారు.
 
 -ఈ సినిమా నెరేషన్ విన్న వివేక్ గారు అచ్చ తెలుగు సినిమాలా వుంది, టైటిల్ ఏమిటని అడిగారు. శ్వాగ్ అని చెప్పగానే ఆయన సర్ప్రైజ్ అయ్యారు. అలా అచ్చ తెలుగు సినిమాలా అనిపించడానికి కారణం వుంది. ఇందులో చాలా రూటెడ్ విషయాలు వుంటాయి. వంశ వృక్షం గురించి అందరికీ తెలిసే ఉంటుంది కానీ అది సినిమాల్లోకి తీసుకురావడం అరుదు.
 
-  తరతరాలుగా మగ ఆడ గొడవ అనేది ఎలా మారుతూ వచ్చింది, ఇప్పటికి దాని రిలవెన్స్ ఏంటి అనే ఆలోచనతో చేసిన కథ.
 
-  యయాతి, భవభూతి క్యారెక్టర్స్  ఇందులో వుంటాయి. యయాతి పేరు పురాణాలలో ఉన్నదే. యదు వంశానికి సంబంధించిన రాజు. ఈ సినిమాలో పేర్లని రిధమిక్ గా పెట్టాలని అనుకున్నాం. అందుకే భవభూతి. యయాతి పేర్లని క్యారెక్టర్స్ కి పెట్టాం. ఇందులో నాలుగు క్యారెక్టర్లకి సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ నాలుగు క్యారెక్టర్స్ కలిసి ఎలాంటి కథ చెప్పబోతున్నారనేది చాలా ఇంట్రెస్టింగ్.
 
రీతూ వర్మ క్యారెక్టర్ స్ట్రాంగ్ లేడీ స్క్రీన్ పర్సోనా వుంది. వింధ్యామర వంశ రాణిగా కనిపిస్తారు. ఈ క్యారెక్టర్ ని ఆమె చేస్తేనే పర్ఫెక్ట్ అనుకున్నాం. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

ACP: హీరోయిజం ఇంట్లో.. బయటకాదు.. ఓవర్ చేస్తే తోక కట్ చేస్తాం: ఏసీపీ (Video)

Telangana: 14 ఏళ్ల బాలిక స్కూల్ బిల్డింగ్ నుంచి పడిపోయింది.. చివరికి?

Telangana: భార్య తెలియకుండా రుణం తీసుకుందని భర్త ఆత్మహత్య

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments