Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ధరిత్రి చిన్నబోయింది.. గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

Webdunia
గురువారం, 28 మే 2020 (11:24 IST)
తెలుగు ప్రజల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి.రామారావు 97వ జయంతి వేడుకలు గురువారం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కారణంగా సాదాసీదాగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు నివాళులు అర్పించారు. మనువళ్ళు అయిన టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు మాత్రం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లలేదు. కరోనా ఆంక్షల నేపథ్యంలో వారు అక్కడకు వెళితే అభిమానులు వస్తారని, తద్వారా సామాజిక భౌతికదూరం మాయమై, కరోనా వ్యాప్తికి కారణమవుతామని భావించారు. అందుకే తమతమ ఇళ్లలోనే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు తమ తాత సేవలను స్మరించుకున్నారు. గుర్తుకు తెచ్చుకున్నారు. 
 
ముఖ్యంగా, సీనియర్ ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా తాతకు నివాళులర్పించిన ఎన్టీయార్ ట్విటర్ ద్వారా తన ఫీలింగ్స్‌ను షేర్ చేసుకున్నాడు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను' అంటూ ఎన్టీయార్ ఫొటోను పోస్ట్ చేశాడు. 'మీరు లేని లోటు తీరనిది' అని ట్వీట్ చేశాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments