నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

ఠాగూర్
బుధవారం, 22 అక్టోబరు 2025 (10:59 IST)
సీనియర్ నటుడు నరేష్ సినీ నిర్మాతల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిర్మాతలు ఆర్టిస్టులను గుర్తించడం లేదన్నారు. కేవలం డబ్బులు ఇస్తే సరిపోతుందనే భావన వారిలో నెలకొందన్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "కె-రాంప్" సినిమా విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‍‌లో నటుడు నరేష్ పాల్గొని మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
'తాను రెండు దశబద్దాలుగా పరిశ్రమలో ఉంటున్నాను. ఈ కాలంలో 200పైగా చిత్రాలకు పైగా నిర్మాతలను చూశాను. చాలా మంది నిర్మాతలు కళాకారులకు కేవలం పారితోషికం ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ కష్టపడి పనిచేసే వారికి డబ్బుతో పాటు గౌరవం కూడా ఇవ్వాలి' అని అన్నారు. 
 
అదేసమయంలో 'కె-ర్యాంప్' నిర్మాత రాజేశ్‌పై నరేష్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఆర్టిస్టులను ఎంతో గౌరవంగా చూసుకుంటారు. అందుకే ఆయన అంటే నాక చాలా ఇష్టం అని అన్నారు. కిరణ్ అబ్బవరం సినిమా హిట్ కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన నరేశ్... యంగ్ టీమ్ ఎపుడూ కష్టపడి పన చేస్తుంది. ఈ సినిమా విజయం దానికి మంచి నిదర్శనం అని అన్నారు. ఇదిలావుంటే నిర్మాతలను ఉద్దేశించి నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mana Mitra App: మన మిత్ర మొబైల్ యాప్‌ను ప్రారంభించిన చంద్రబాబు

తొలిసారి భార్య భారతితో దీపావళి జరుపుకున్న వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి (ఫోటోలు)

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియాతో నారా లోకేష్ డీల్

మొక్కజొన్న కంకి మృత్యుపాశమైంది.. బ్రెయిన్ డెడ్ రూపంలో భర్తను దూరం చేసింది...

మటన్ కూరలో కారం ఎక్కువైందని భర్త మందలింపు.. భార్య సూసైడ్... మనస్తాపంతో భర్త కూడా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments