Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలకృష్ణ గారిలా తొడగట్టి K-ర్యాంప్ విజయం అని చెప్పాం : రాజేశ్ దండ, శివ బొమ్మకు

Advertiesment
Producers Rajesh Danda, Shiva Bommaku

చిత్రాసేన్

, మంగళవారం, 14 అక్టోబరు 2025 (18:04 IST)
Producers Rajesh Danda, Shiva Bommaku
కిరణ్ అబ్బవరం తో నేను ఒక సినిమా చేయాలి. రూల్స్ రంజన్ తర్వాత మా కాంబోలో ఒక సినిమా చేయాలని నిర్ణయించాం. దర్శకుడు జైన్స్ నాని కిరణ్ గారితో ఏడాదిన్నరగా ట్రావెల్ చేస్తున్నారు. ఆయన చెప్పిన కథ నచ్చి నా దగ్గరకు పంపించారు. కథ వినగానే నాకూ నచ్చింది. ఇందులో హీరో పాత్ర పేరు కుమార్. ఆ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంది. ముందుగా ఈ చిత్రానికి కుమార్ ర్యాంప్ అనే టైటిల్ అనుకున్నాం. అయితే అది కాస్త లెంగ్తీగా ఉందని K-ర్యాంప్ అని పెట్టాం.

టైటిల్ కొందరికి బూతులా అనిపించవచ్చు. అది వారి దృష్టి కోణం. కుమార్ అనే పేరున్న హీరో క్యారెక్టరైజేషన్ నేపథ్యంగా టైటిల్ అని పెట్టాం. కిరణ్ గారి గత సినిమా క సినిమా కూడా K అనే అక్షరంతో ఉంది కాబట్టి అది కూడా సెంటిమెంట్ గా భావించాం అని నిర్మాతలు రాజేశ్ దండ, శివ బొమ్మకు అన్నారు.
 
ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమాలోని హైలైట్స్ తెలిపారు ప్రొడ్యూసర్స్ రాజేశ్ దండ, శివ బొమ్మకు.
రాజేశ్ దండ మాట్లాడుతూ,  నేను బాలకృష్ణ గారి అభిమానిని. K-ర్యాంప్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు మూడు వేల మందికి పైగా రావడం సర్ ప్రైజ్ అయ్యాను. ఆ హై లో బాలకృష్ణ గారిలా తొడగట్టి మా మూవీ విజయం సాధిస్తుందని చెప్పాను. నేను సాధారణంగా ఎక్కువగా మాట్లాడను. కానీ మన సినిమా గురించి మనం చెప్పుకోకుంటే ఎలా ఉంటుందని మాట్లాడుతున్నా.
 
-  కథలో హీరోయిన్ కేరళ అమ్మాయి. అక్కడ కాలేజ్ లో చేసిన సీన్స్, ఓనమ్ సాంగ్ విజువల్ గా కలర్ ఫుల్ గా వచ్చాయి. థియేటర్స్ లో ఆ విజువల్ బ్యూటీని మీరంతా ఎంజాయ్ చేస్తారు.
 
- మా సంస్థకు ప్రధాన బలం ఫ్యామిలీ ఆడియెన్స్. మా సంస్థలో వచ్చిన సామజవరగమన, ఊరు పేరు భైరవకోన, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి చిత్రాలన్నీ ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరించారు. ఇది కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కడా ఇబ్బంది పడరు. మీరు మా సినిమా టీజర్ కు, ట్రైలర్ కు తేడా చూసే ఉంటారు. కావాలనే కొన్ని తగ్గించాం. మనం ఫ్రెండ్స్ తో చిల్ అయ్యేప్పుడు ఎలా మాట్లాడుకుంటామో అలా డైలాగ్స్ ఉంటాయి.
 
- చేతన్ భరద్వాజ్ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. నరేష్, వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ ఆకట్టుకుంటాయి.  కామ్నా జఠ్మలానీ, విమలారామన్ గారిని తీసుకున్నాం. మా పాప కూడా ఈ చిత్రంలో ఓ రోల్ చేసింది. ఇప్పటిదాకా మా సంస్థలో చేసిన ప్రతి సినిమాకు అన్ని విధాలా మంచి బిజినెస్ జరిగింది.
 
- శివ బొమ్మకు నా స్నేహితుడు. ఈ చిత్రంతో నాతో పాటు ప్రొడక్షన్ లో భాగమయ్యారు. నా మీద నమ్మకంతో కథ కూడా వినకుండా పార్టనర్ గా చేసేందుకు ముందుకొచ్చారు. మా కాంబినేషన్ లో ఇకపై మరిన్ని మూవీస్ చేయబోతున్నాం. 
 
- నా ఫేవరేట్ హీరో బాలకృష్ణ గారితో సినిమా చేయాలనేది నా కోరిక. మంచి కథ కుదిరితే ఆయనను అప్రోచ్ అవుతాం. మా సంస్థలో సామజవరగమన 2 చేస్తాం. అదే టీమ్ కాంబినేషన్ లో సీక్వెల్ మూవీ ఉంటుంది. 
 
- ప్రస్తుతం హీరోయిన్ సంయుక్త గారితో ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ జరుగుతోంది. ఈ దీపావళికి ఆ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేస్తాం. నెక్ట్స్ ఇయర్ రిలీజ్ ఉంటుంది. అన్నపూర్ణ స్డూడియోస్ తో కలిసి అల్లరి నరేష్ గారితో ఓ సినిమా నిర్మిస్తున్నాం. ఇది కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nayanatara: మన శంకరవరప్రసాద్ గారు నుంచి ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల రిలీజ్