Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Advertiesment
tollywood industry

ఠాగూర్

, ఆదివారం, 31 ఆగస్టు 2025 (10:46 IST)
సినీ నిర్మాణ కార్మికులకు తెలుగు ఫిల్మ్ చాంబర్ వేతనాలు పెంచింది. ఈ నెల 22 తేదీన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ సమక్షంలో 13 సినీ కార్మిక సంఘాలు, నిర్మాతలకు మధ్య జరిగిన ఒప్పందం మేరకు 22.5 శాతం వేతనాలు పెంచుతూ నూతన వేతన కార్డును నిర్ణయించినట్టు ఫిల్మ్ చాంబర్ వెల్లడించిన విషయం తెల్సిందే. 
 
ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే యేడాది ఆగస్టు 22 వరకు 15 శాతం పెంపును అమలు చేయాలని నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు జారీచేసింది. సంఘాల వారీగా వేతనాలను సవరిస్తూ నిర్మాతలకు లేఖలు పంపింది. జూనియర్ ఆర్టిస్టులను మూడు విభాగాలుగా చేసి 'ఏ' కేటగిరిలో రూ.1,420, 'బి' కేటగిరిలో రూ.1,175, 'సి' కేటగిరిలో రూ.930 ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఉదయం అల్పాహారం సమకూర్చకుంటే రూ.70, మధ్యాహ్నం భోజనం సమకూర్చకుంటే రూ.100 అదనంగా ఇవ్వనున్నారు.
 
ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్‌కు రూ.1,470, హఫ్ కాల్ షీట్‌కు రూ.735 చెల్లించనున్నారు. కాల్ షీట్ సమయం 4 గంటలు దాటిన తర్వాత మాత్రమే పూర్తి వేతనం చెల్లిస్తారని, జీతాలు పని నిబంధనలకు సంబంధించి ఇతర సమస్యలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కమిటీకి తెలియజేయాలని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు. 
 
కమిటీ ఏర్పడే వరకు ప్రతి ఒక్కరూ కార్మిక శాఖ నిర్ణయించిన ఆగస్టు 21 తేదీ నాటి మినిట్స్‌ను అనుసరించాలని నిర్మాతలకు సూచించారు. ఇతర అన్ని వర్కింగ్ కండీషన్స్, అలవెన్సులు 2022లో కుదిరిన ఒప్పందం ప్రకారమే అమల్లో ఉంటాయని ఆయన వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)