Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

Advertiesment
Balakrishna

డీవీ

, శనివారం, 30 ఆగస్టు 2025 (23:29 IST)
Balakrishna
సీనియర్ తెలుగు సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లండన్‌లోని ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో సత్కరించబడ్డారు. ఈ సత్కార కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది.
 
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా సినిమా, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆయన చేసిన అమూల్యమైన సేవకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పద్మభూషణ్ గ్రహీతను తన గోల్డ్ ఎడిషన్‌లో చేర్చింది.
 
ఈ కార్యక్రమంలో అభిమానులను ఉద్దేశించి ప్రసంగించిన బాలయ్య, మరోసారి తన దాతృత్వాన్ని ప్రదర్శించారు, కామారెడ్డి, జగిత్యాల, ఇతర జిల్లాలతో సహా అనేక జిల్లాలను ప్రభావితం చేసిన ఇటీవలి వరదల బాధితుల ఉపశమనం, పునరావాసం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. 
తెలంగాణ వరద బాధితుల కోసం విరాళం ప్రకటించిన మొదటి టాలీవుడ్ స్టార్‌గా బాలయ్య నిలిచారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా, అఖండ 2: తాండవన్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.
 
ఇకపోతే.. ఈ కార్యక్రమంలో సీనియర్ నటి జయసుధ మాట్లాడుతూ.. "బాలయ్య బాబు  సన్మానంలో నేను పాల్గొనటం ఆనందంగా ఉంది. బాలకృష్ణ నటుడిగానే కాదు వ్యక్తిగానూ ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు. నేను ఎన్టీఆర్ గారితోనూ, బాలకృష్ణ సరసన రకరకాల పాత్రల్లో నటించాను. బాలకృష్ణ డెడికేషన్ ఇప్పటి యంగర్ జనరేషన్‌కు స్పూర్తి. ఇంకా మరిన్ని రికార్డ్స్ బాలయ్య అందుకోవాలి" అని తెలిపారు
 
దిల్ రాజు మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణ ఎప్పటికీ మన హీరో. 50 ఏళ్ల కెరీర్ కలిగిన బాలయ్య గారికి ఈ రికార్డు రావటం తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణం." అని అన్నారు. 
Balakrishna
 
ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. "చరిత్ర రాయాలన్నా తిరిగరాయాలన్నా బాలయ్య గారిగే సాధ్యం.. నాకు వారు ముద్దుల మావయ్య.. మాస్ హీరోగా బాలకృష్ణకు డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. బాలకృష్ణ గారికి ఎప్పుడు యంగ్ స్టర్.. వారి ఎనర్జీ మాకు లేదు.. ఆ సీక్రెట్ ఇప్పటి వరకు మాకు తెలియలేదు. రకరకాల జోనర్ సినిమాలు పాత్రల్లో నటించి మెప్పించటం బాలయ్యకే సాధ్యం.. బాలయ్య బాబు నిర్మాతల దర్శకుల డ్రీమ్ హీరో.. ఓటిటిలో కూడా బాలయ్య మెప్పించారు. బాలయ్య బాబు భోళా మనిషి.. మంచి మనస్సున్న మా మావయ్య.. అప్ అండ్ డౌన్స్‌లో ఒకేలా ఉండగలరు..ప్రజలకు అండగా నిలబడటంలో ముందుండే వ్యక్తి.. ఇలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో మరోకరు లేరు. బాలయ్య బాబు అన్ స్టాపబుల్.. నాకు ముద్దుల మావయ్యగా ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి ధన్యవాదాలు." అన్నారు. 
 
బండి సంజయ్ మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు 65 ఏళ్ల మనిషి .. 25 ఏళ్ల‌ మనస్సు..ముక్కుసూటిగా ఉండే వ్యక్తి బాలయ్య బాబు. వారికి సినీ చరిత్రలో 50 ఏళ్ల కెరీర్‌కు రికార్డు.. అనేది తెలుగు వారికి గర్వకారణం. నటుడిగా కుటుంబ వారసత్వాన్ని కొనసాగించటంతో పాటు అప్పటినుంచి ఇప్పటివరకు అదే ఎనర్జీతో నటిస్తూ మెప్పిస్తున్నారు. అనేక ఒడిదుడుకులు అవమానాలు ఎదురైనా నిలబడ్డారు.

ఎన్టీఆర్ గారి చరిత్రను వక్రీకరించి అనేక సినిమాలు వస్తున్నా.. వారి తండ్రిపై ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా చేశారు. డాక్టర్ కాకున్నా బసవతారకం హాస్పిటల్ ద్వారా భరోసా విశ్వాసం దైర్యం అందిస్తున్నారు. తెలుగు వారికి ఆవేశం ఆనందం ఆలోచన వచ్చినా జై బాలయ్య అంటే ఓ ఉత్సాహం. బాలకృష్ణ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్దిల్లి మరిన్ని అవార్డులు, రికార్డులు అందుకోవాలి" అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..