Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

Advertiesment
Balayya revied award letter - Pawan kalyan

దేవీ

, సోమవారం, 25 ఆగస్టు 2025 (10:18 IST)
Balayya revied award letter - Pawan kalyan
లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR), యూకే, యుఎస్ఎ, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా, యుఎఇలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ, వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలలో ఒకదాన్ని నట సింహం నందమూరి బాలకృష్ణ గారికి ప్రదానం చేస్తున్నారు - భారతీయ సినిమాలో అత్యంత ఘనమైన ఆయన వారసత్వం ఇప్పుడు WBR గోల్డ్ ఎడిషన్‌లో నమోదు అవుతుంది.
 
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇఓ సంతోష్ శుక్లా జారీ చేసిన అధికారిక ప్రశంసలో, బాలకృష్ణ గారి ఐదు దశాబ్దాల సినిమా సేవలను మిలియన్ల మందికి స్ఫూర్తిగా ప్రశంసించారు - ఇది భారతీయ సినిమాలో గోల్డెన్ బెంచ్‌మార్క్‌ను స్థాపించిన వారసత్వం. సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయి ఉండి నిరంతరం తనను తాను పునర్నిర్మించుకునే ఆయన సామర్థ్యం, ప్రముఖ నటుడి ప్రయాణాన్ని మాత్రమే కాకుండా తరాలను కలిపే సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
 
భారతీయ సినిమాలో హీరోగా ఆయన అసాధారణ సేవలకు గుర్తింపుగా.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో బాలకృష్ణ గారి చేరికను ఘనమైన గుర్తింపుగా, WBR CEO ఆగస్టు 30వ తేదీన హైదరాబాదులో స్వయంగా బాలకృష్ణ గారికి అందిస్తున్నారు.
 
పవన్ కళ్యాణ్ అభినందనలు
బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం MLA, పద్మ భూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి