లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక చిత్రం రాబోతోందని తమిళవర్గాలు చెబుతున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాకు లోకేష్ దర్శకుడు. అందులో నటించిన కన్నడ నటి రచితా రామ్ విలన్ షేడ్‌లలో కనిపించింది. ఇప్పుడు ఆమె నాయికగా మారోబోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధిన వార్తలు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.
ధనుష్ తో కెప్టెన్ మిల్లర్, కీర్తి సురేష్ నటించిన సాణి కాయిధం చిత్రాలకు దర్శకత్వం చేసిన అరుణ్ మాథేశ్వరన్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియనున్నాయి.