Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

Advertiesment
Ashock, Reshman

దేవీ

, శనివారం, 30 ఆగస్టు 2025 (19:16 IST)
ఉఫ్ఫ్ యే సియాపా: బాలీవుడ్ కథా కథనాన్ని ఒక కొత్త పంథా తో చెప్పబోతున్న బోల్డ్ సైలెంట్ కామెడీ. 40 సంవత్సరాల తర్వాత తిరిగి కమల్ హాసన్ నటించిన పుష్పక విమానం వలె, డైలాగులేని, నిజం చెప్పాలంటే డైలాగ్ అవసరపడని సినిమా. నాలుగైదు జనరేషన్స్ మిస్సయిన ఒక అద్భుతం.  జి. అశోక్ దర్శకత్వం వహించి లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై లవ్ రంజన్ మరియు అంకుర్ గార్గ్ నిర్మించిన ఉఫ్ఫ్ యే సియాపా నియమాలను తిరిగి రాస్తోంది. సెప్టెంబర్ 5, 2025న విడుదల కానున్న ఈ డార్క్ కామెడీ-థ్రిల్లర్  డైలాగ్‌ లేకుండా ఒక కథని చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది.
 
పూర్తిగా  హావభావాలతో, పర్ఫామెన్స్ ని ఆధారంగా తీసుకొని హాస్యంతో కూడుకున్న దృశ్య మాలికకు ఇండియా గర్వకారణమైన ఆస్కార్ విన్నర్ ఎ. ఆర్. రెహమాన్ యొక్క ఉత్తేజకరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడం ఇంకా విశేషం.
 
ఉఫ్ఫ్ యే సియాపా యొక్క కేసరి లాల్ సింగ్ (తుంబడ్ ఫేమ్ సోహుమ్ షా), అతని జీవితం గందరగోళంలోకి తిరుగుతుంది, పొరపాటున జరిగిన ఒక పార్సిల్ డెలివరీ మరియు వరుస అపార్థాలు అతని ఇంటిని నేరస్థలంగా మారుస్తాయి.  అతని భార్య పుష్ప (నుష్రత్ భరుచ్చ) అతను తమ పొరుగున ఉన్న కామిని (నోరా ఫతేహి) తో సరసాలాడుతున్నాడని అనుమానిస్తుంది,అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్లిన తరువాత అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎటువంటి ఆసక్తిని ఎంతటి హాస్యాన్ని కురిపిస్తాయి అన్నది మిగతా కథ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్