Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరపైకి శ్రీదేవి బయోపిక్.. హీరోయిన్‌గా 'గీతగోవిందం' భామ??

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (16:30 IST)
ఇపుడు భారతీయ చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల కాలం నడుస్తోంది. ఇప్పటికే అనేక మంది జీవిత చరిత్రలను ఆధారంగా చేసుకుని పలు చిత్రాలు వచ్చాయి. అవన్నీ సూపర్ హిట్లే. అలాగే, తెలుగులోనూ పలు బయోపిక్‌లు వచ్చాయి. ఈ క్రమంలో అలనాటి అందాల నటి, వెండితెర అతలోక సుందరి దివంగత శ్రీదేవి జీవిత చరిత్ర కూడా వెండితెరపై దృశ్యకావ్యంగా రానుంది. 
 
భారతీయ సినిమాల్లో 50 సంవత్సరాల కెరీర్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, తదితర భాషల్లో 300కు పైగా సిమాలు చేసిన నటిగా శ్రీదేవికి ప్రత్యేక గుర్తింపువుంది. దీంతో ఆమె బయోపిక్‌ను తెరకెక్కించాలని శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ భావిస్తున్నారట. మ‌రి ఈ బ‌యోపిక్‌లో ఎవ‌రు న‌టిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. 
 
అయితే లేటెస్ట్‌గా నేను రేసులో ఉన్నాగా! అంటూ కన్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా లైన్లోకి వ‌చ్చింది. తాజాగా అభిమానుల‌తో సోష‌ల్ మీడియాలో చిట్ చాట్ చేసిన ర‌ష్మిక, వారినొక ప్ర‌శ్న వేసింది. శ్రీదేవి బ‌యోపిక్‌, సౌంద‌ర్య బ‌యోపిక్.. వీటిలో నేను ఏది చేస్తే బెట‌ర్‌? అని అడిగింది. అభిమానులంతా శ్రీదేవి బ‌యోపిక్‌లో ర‌ష్మిక చేయాలంటూ ఆన్స‌ర్ ఇచ్చేశారు. 
 
నేను కూడా అదే అనుకున్నానంటూ ర‌ష్మిక స‌మాధాన‌మిచ్చింది. మరి రష్మికను నిజంగానే ఎవరైనా శ్రీదేవి, సౌందర్య బయోపిక్ కోసం సంప్రదించారా?  లేక ఆమె మ‌న‌సులో అనుకుంటుందా? అనే విష‌యం మాత్రం తెలియ‌డం లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.! 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు పక్కనే కారు ఆపాడు... ఆ పక్కనే కానిచ్చేశాడు (Video)

రెప్పపాటులో తప్పిన ప్రాణముప్పు... రైలు దిగుతుండగా (Video)

సిరియాలో చెలరేగిన అల్లర్లు - 745 మంది అమాయక పౌరులు మృతి

భారత్‌కు పొంచివున్న యుద్ధ ముప్పు - ఆ రెండు దేశాల కుట్ర : ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

అమరావతి - శ్రీకాకుళంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments