డియర్ దత్ గారూ... సినిమా సెట్స్‌పైకి వెళ్లాక చెక్కుతో రండి... దీపికా

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (16:24 IST)
టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి దీపికా పదుకొనెను ఎంపిక చేశారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నారు.
 
కరోనా మహమ్మారి కాస్త సద్దుమణిగిన తర్వాత ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దానికంటే ముందుగా ఈ చిత్రంలో ఎంపిక చేసిన నటీనటులకు అడ్వాన్సులను నిర్మాతలు అందజేస్తున్నారు. 
 
ఈ క్రమంలో హీరోయిన్ దీపకకు కూడా అడ్వాన్స్ చెక్ ఇచ్చేందుకు నిర్మాత అశ్వనీదత్ సంప్రదించారట. అయితే, ఆమె మాత్రం అడ్వాన్స్ తీసుకునేందుకు ససేమిరా అన్నదట. సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాతే అడ్వాన్స్ చెక్ తీసుకరండి అని చెప్పారట. 
 
దీనికి కారణం లేదు. ప్రస్తుతం పరిస్థితులు మునుపటిలా లేవు. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులు ఎపుడు మొదలవుతాయో తెలియని అయోమయ పరిస్థితినెలకొంది. ఇలాంటి సమయంలో ముందుగా అడ్వాన్సులు తీసుకుని నిర్మాతలను ఇబ్బంది పెట్టడం సబబు కాదని భావించిన దీపికా పదుకొనే ప్రస్తుతానికి అడ్వాన్స్ చెక్ వద్దని చెప్పారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments